Begin typing your search above and press return to search.

జంప‌యిన దేశాధ్య‌క్షుడు...75 కోట్లు గాయ‌బ్‌

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:13 PM GMT
జంప‌యిన దేశాధ్య‌క్షుడు...75 కోట్లు గాయ‌బ్‌
X
దేశాధ్య‌క్షుడే జంప్ అయిపోవ‌డం వింత అనుకుంటే ఆయ‌న గాయ‌బ్ అవుతుంటే 75 కోట్లు గాయ‌బ్ అయిపోవ‌డం ఇంకో వింత‌. ఇలాంటి వింత‌ల‌కు కార‌ణం అయింది గాంబియా మాజీ దేశాధ్య‌క్షుడు యాయేహ్ జ‌మ్మెహ్. గాంబియాను సుదీర్ఘ‌కాలం పాటు పాలించిన ప్రెసిడెంట్ యాయేహ్ జ‌మ్మెహ్ ఇటీవ‌ల జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్‌ గా అదామా బారో గెలిచారు. కానీ జ‌మ్మెహ్ మాత్రం ప్ర‌జాతీర్పును వ్య‌తిరేకించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అంగీక‌రిచ‌న‌ని జ‌మ్మెహ్ తీర్మానించారు. అయితే పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ దేశాలు వ‌త్తిడి తేవ‌డంతో జ‌మ్మెహ్ త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. దేశం విడిచి వెళ్తూ వెళ్తూ భారీ ఖ‌జానాతో ఉడాయించారు.

ముందుగా మొండిప‌ట్టు వేసిన‌ప్ప‌టికీ మిలిట‌రీ ద‌ళాలు రంగంలోకి దిగి గాంబియా రాజ‌ధాని బాంజుల్‌ కు చేరుకున్న త‌ర్వాత జ‌మ్మెహ్ దేశం విడిచి వెళ్లేందుకు అంగీక‌రించారు. అయితే జ‌మ్మెహ్ వెళ్తూ వెళ్తూ ప్ర‌జా ఖాజానను లూటీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర ఖ‌జాన నుంచి సుమారు 11 మిలియ‌న్ల డాల‌ర్లు (రూ.75 కోట్లు) ఖాళీ అయిన‌ట్లు అధికారులు ఫిర్యాదు చేశారు. ఖ‌రీదైన కార్లు - వ‌స్తువుల‌ను మాజీ అధ్య‌క్షుడు ఎత్తికెళ్లిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వాటిని ప్ర‌త్యేక ప్లేన్‌ లో త‌ర‌లించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే నూత‌న ప్రెసిడెంట్‌ గా ఎన్నికైన ఆదామా బారో ప్ర‌స్తుతం సెనిగ‌ల్‌ లో త‌ల‌దాచుకున్నారు. ఆయ‌న రాక కోసం దేశ రాజ‌ధానిలో ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. సుమారు 22 ఏళ్లు గాంబియాను పాలించిన జ‌మ్మెహ్ శ‌నివారం దేశం విడిచి వెళ్లారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/