Begin typing your search above and press return to search.

గాలి వియ్యంకుడి పెళ్లికార్డు అదిరిపోయిందిగా

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:23 PM GMT
గాలి వియ్యంకుడి పెళ్లికార్డు అదిరిపోయిందిగా
X
మైనింగ్ బ్యార‌న్‌ - క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమ‌ర్తె బ్రాహ్మ‌ణి వివాహ శుభ‌లేఖ ఎలా ఉందో ఇటీవ‌లే చూశాం. బాలీవుడ్ సినిమా స్థాయిలో రూపొందించిన ఈ వీడియో ఆహ్వానం దేశంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అతిథి దేవోభవ అంటూ గాలి జనార్దన్‌ రెడ్డి - ఆయన సతీమణి పాడే పాటతో ఆహ్వాన పత్రిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ధీటుగా సినీ ఫక్కీలో ఆయన కుమార్తె - అల్లుడికి సంబంధించిన దృశ్యాలను చాలా రిచ్‌ గా చిత్రీకరించారు. చివరన గాలి దంపతులు - కొడుకు - కుమార్తె - అల్లుడు కలిసి వివాహ వేదిక - సమయాన్ని వెల్లడించడంతో ఆహ్వాన పత్రిక వీడియో ముగుస్తుంది. అదే రేంజ్‌ లో గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి కాబోయే వియ్యంకుల వారి పెళ్లి పిలుపు ప్ర‌క‌టించారు. గాలి వారి శుభ‌లేఖ త‌ర‌హాలోనే దీనికీ ప్రోమోను రూపొందించారు.

ఈ ప్రోమోలో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురు - వారి అల్లుడు - వియ్యంకులు ఆహ్వాన దృశ్యాల‌ను చాలా రిచ్‌ గా షూట్ చేశారు.అంతేకాకుండా ఈ వీడియోను గూగుల్ ప్లేస్టోర్ లో - యాపిల్ ఆప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే... గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఆహ్వానానికి ఏ మాత్రం త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా వియ్యంకుల వారి త‌ర‌ఫున కూడా ఉంది. యువ పారిశ్రామికవేత్త రాజేందర్‌ రెడ్డితో బ్రాహ్మిణీ వివాహం నవంబర్ 15 నుంచి తొమ్మిదిరోజులపాటు బళ్లారిలో జరుగనున్న సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/