Begin typing your search above and press return to search.

దిమ్మ‌తిరిగేలా ఉన్న గాలి కూతురు వివాహ ఖ‌ర్చు!

By:  Tupaki Desk   |   20 Oct 2016 12:49 PM GMT
దిమ్మ‌తిరిగేలా ఉన్న గాలి కూతురు వివాహ ఖ‌ర్చు!
X
కర్ణాటక మాజీ మంత్రి - మైనింగ్ బ్యార‌న్‌ గాలి జనార్దన్‌ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం కనీవిని ఎరుగని రీతిలో తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను రూపొందించిన ఆయన దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇప్ప‌టికే వివాహ ఆహ్వానంతో అదిరిపోయేలా పెళ్లికి ఆహ్వానిస్తున్న గాలి వార్త హ‌ల్‌ చ‌ల్ చేస్తుండ‌గా తాజాగా ఆయ‌న కూతురు పెళ్లికి పెట్టే ఖ‌ర్చు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుమారు 200 కోట్ల రూపాయ‌లు వివాహ ఖ‌ర్చుగా వెచ్చించున్న‌ట్లు స‌మాచారం. ఇంత మొత్తంతో వివాహానికి హార‌య్యేందుకు ప్ర‌త్యేక హెలీకాప్ట‌ర్లు - ప్ర‌త్యేక రైళ్లు - ప్ర‌త్యేక బ‌స్సులు బుక్ చేశారు. దీంతో వీవీఐపీల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌న్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా వివాహానికి హాజ‌ర‌య్యే వారికి ఉల్లాసం క‌లిగిచేందుకు బాలీవుడ్ న‌టీ - న‌టుల‌తో ప్ర‌త్యేకంగా డ్యాన్స్ వేడుక‌లు రూపొందించారు.

తన కూతురు బ్రాహ్మిణీ వివాహం కోసం ఒక నిమిషం నిడివితో ఎల్సీడీ బాక్స్ రూపంలో రూపొందించిన డిజిటల్ ఆహ్వాన పత్రిక బాలీవుడ్ చిత్ర నిర్మాణాన్ని తలదన్నేలా ఉంది. అతిథి దేవోభవ అంటూ గాలి జనార్దన్‌ రెడ్డి - ఆయన సతీమణి పాడే పాటతో ఆహ్వాన పత్రిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ధీటుగా సినీ ఫక్కీలో ఆయన కుమార్తె - అల్లుడికి సంబంధించిన దృశ్యాలను చాలా రిచ్‌ గా చిత్రీకరించారు. చివరన గాలి దంపతులు - కొడుకు - కుమార్తె - అల్లుడు కలిసి వివాహ వేదిక - సమయాన్ని వెల్లడించడంతో ఆహ్వాన పత్రిక వీడియో ముగుస్తుంది. యువ పారిశ్రామికవేత్త రాజేందర్‌ రెడ్డితో బ్రాహ్మిణీ వివాహం నవంబర్ 15 నుంచి తొమ్మిదిరోజులపాటు బళ్లారిలో జరుగనుంది. ఇదిలాఉండ‌గా గ‌తంలో అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డి మూడేండ్లు జైలుశిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/