చెట్టెక్కిన ‘గాలి’.. తెంపి భార్య చేతిలో..

Tue May 21 2019 15:24:43 GMT+0530 (IST)

మైనింగ్ కింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అంటే తెలియని వారుండరు.. మొన్నటివరకు  కేసులతో ఉక్కిరిబిక్కిరైన ఈయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు దెబ్బ ఎదురైంది. రాజకీయాల్లో గెలవలేకపోయారు. ప్రస్తుతం సేద తీరుతున్న ఆయన తనకు పిల్లనిచ్చిన మామ స్వగ్రామం అయిన కర్నూలు జిల్లాకు వచ్చారు.ఈ సందర్భంగా మామా మామిడితోటలో భార్యతో కలిసి సేదతీరారు.  మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలు కోశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆయనే స్వయంగా పోస్టు చేయడం విశేషం. 27 ఏళ్ల క్రితం ఈ చెట్లు నాటామని.. ఆ చెట్ల కాయలు కోసి తన భార్య అరుణ్ కు ఇవ్వడం సంతోషం కలిగించిందని గాలి చెప్పుకొచ్చాడు.

చెట్లు ఎక్కి కోసినప్పడు తన బాల్యం మరోసారి గుర్తుకు వచ్చిందని గాలి జనార్ధన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన స్నేహితులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇలా చెట్టు ఎక్కడమే కాదు.. దాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేసుకొని తన చిన్ననాటి సృతులను గాలి గుర్తు చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..