Begin typing your search above and press return to search.

30 ల‌క్ష‌ల ఉద్యోగాల్ని తేనున్న జీఎస్టీ?

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:57 AM GMT
30 ల‌క్ష‌ల ఉద్యోగాల్ని తేనున్న జీఎస్టీ?
X
జీఎస్టీ మీద బోలెడ‌న్ని భ‌యాలు.. మ‌రెన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. వ్యాట్ స్థానే వ‌చ్చిన జీఎస్టీతో దేశంలో ప‌న్ను విధానం మొత్తంగా మారిపోతుంద‌ని.. దాని ప్ర‌భావం ఎంతో బాగుంటుంద‌న్న మాట వినిపించినా.. ఇప్ప‌టికీ ప‌న్ను చెల్లించ‌కుండా వ‌స్తువుల్ని అమ్మ‌కాలు జ‌ర‌ప‌టం.. అన‌ధికార లావాదేవీలు జోరుగా సాగ‌టం చూస్తున్న‌దే. జీఎస్టీ మీద ఓప‌క్క వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. దీని కార‌ణంగా రానున్న నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో భారీగా ఉద్యోగాలు వ‌చ్చే వీలుంద‌న్న అంచ‌నా ఒక‌టి ఆస‌క్తిక‌రంగా మారింది.

జీఎస్టీ అమ‌లుతో భార‌త్ లోని లాజిస్టిక్ రంగం ఏటా రెండెంక‌ల వృద్ధితో దూసుకుపోవ‌ట‌మే కాదు.. ఉద్యోగ‌వ‌కాశాలు భారీగా పెర‌గ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. టీమ్ లీజ్ సంస్థ రూపొందించిన లాజిస్టిక్స్ రివ‌ల్యూష‌న్‌- బిగ్ బెట్స్‌.. బిగ్ జాబ్స్ నివేదిక ప్ర‌కారం రానున్న నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇంత‌కీ ఏ త‌ర‌హా ఉద్యోగ‌వ‌కాశాలు పెరుగుతాయ‌న్న‌ది చూస్తే.. రోడ్ ఫ్రైట్‌.. రైల్ ఫ్రైట్‌.. వేర్ హౌజింగ్‌.. వాట‌ర్ వేస్‌.. ఎయిర్ ఫ్రైట్‌.. ప్యాకేజింగ్‌.. కొరియ‌ర్ స‌ర్వీసుల్లో కొత్త ఉద్యోగాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ నివేదిక‌ ప్ర‌కారం ఒక్క హైద‌రాబాద్ రీజియ‌న్ లోనే ఈ రంగాల్లో 1.96 ల‌క్ష‌ల ఉద్యోగాలు రానున్న‌ట్లు చెబుతున్నారు. రోడ్ ఫ్రైట్ విభాగంలో 1.45 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఎయిర్ ఫ్రైట్ లో 26 వేల జాబ్స్‌.. రైల్ ఫ్రైట్‌ లో నాలుగు వేల ఉద్యోగాలు రావ‌టం ఖాయ‌మంటున్నారు. మ‌రి.. ఈ భారీ ఉద్యోగాల క‌ల్ప‌న దేశాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌టం ఒక ఎత్తు అయితే.. హైద‌రాబాద్ బ్రాండ్ వాల్యూ మ‌రింత పెరగ‌టం ఖాయం. రానున్న రోజుల్లో ఉద్యోగవ‌కాశాల ఎలా ఉంటాయ‌న్న బెంగ‌తో ఉన్న వారికి ఈ నివేదిక భారీ గుడ్ న్యూస్ చెప్పిన‌ట్లే.