యూపీలో జర్నలిస్టును ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే!

Wed Jun 12 2019 10:50:52 GMT+0530 (IST)

ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్టుల మీద దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వానికి... అధికారులకు వ్యతిరేకంగా ఏ చిన్న వార్త రాసినా.. సోషల్ మీడియాలో ఏ చిన్న కామెంట్ పెట్టినా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో దాడులకు తెగబడుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు సైతం యూపీలోని జర్నలిస్టును 11 రోజులు రిమాండ్ కు తరలించిన అంశంపై ఘాటుగా రియాక్ట్ కావటం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మరో వైరల్ మీడియాలో తెర మీదకు వచ్చింది. ఒక ప్రభుత్వ అధికారి జర్నలిస్టుపై అమానుషంగా దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావటమే కాదు.. యూపీలో ఇంత దారుణ పరిస్థితి ఉందా? అన్న భావన కలిగేలా చేస్తున్నాయి. రైలులో అనధికార వ్యాపారులపై కథనాన్ని ప్రచురించినందుకు రైల్వే పోలీస్ ఇన్ స్పెకర్టర్ రాకేశ్ కుమార్ దాడి చేసిన వైనం ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో జర్నలిస్టుపై ఆయన దారుణంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి రికార్డు అయ్యింది. తనను దారుణంగా కొట్టటమేకాదు.. కెమెరానుకూడా ధ్వంసం చేసినట్లుగా సదరు జర్నలిస్టు వాపోయారు. అంతేకాదు.. లాకప్ లో వేసి బట్టలూడదీసి.. నోట్లో మూత్రం పోశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన రైల్వే శాఖ సదరు అధికారుల్నిగుర్తించి వారిపై వేటు వేసింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.