Begin typing your search above and press return to search.

అంతా తూచ్; గ్రేటర్ సర్వేలో గ్రేట్ మిస్టేక్

By:  Tupaki Desk   |   6 Feb 2016 7:26 AM GMT
అంతా తూచ్; గ్రేటర్ సర్వేలో గ్రేట్ మిస్టేక్
X
పెరిగిన పోటీ.. అందరికి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించే క్రమంలో పరుగులు పెట్టటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. నాణ్యత తగ్గిందన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఇదే వాదనను మరోసారి తెర మీదకు తీసుకురావటం గమనార్హం. తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితాల విషయానికి వస్తే.. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు మీడియా సంస్థలు.. నిఘా వర్గాలు తమ సర్వేల్ని వెల్లడించాయి.

ఈ సర్వేలన్నీ.. తాజాగా విడుదలైన ఫలితాల్ని చూస్తే.. అవెంత తప్పుగా ఉన్నాయన్నది ఇట్టే అర్థమవుతుంది. అంచనాకు.. వచ్చిన ఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేని తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేయటంతో పాటు.. ఎవరూ గ్రేటర్ పల్స్ ను పట్టుకోవటంలో ఫెయిల్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అధికార పక్షానికి వచ్చే సీట్లను కాస్త దగ్గరకు వచ్చినా.. విపక్షాలకు వచ్చే సీట్ల విషయంలో వేసుకున్న అంచనాలే భారీగా వమ్ము కావటం గమనార్హం. అదే సమయంలో మజ్లిస్ సాధించే డివిజన్ల విషయంలో కొన్ని సంస్థలు దగ్గరగా వస్తే.. మరికొన్ని మీడియా సంస్థల అంచనాకు వాస్తవానికి మధ్య అస్సలు సంబంధమే లేదని చెప్పాలి.

పలు మీడియా సంస్థలు వెల్లడించిన ఫలితాలకు.. వాస్తవానికి మధ్య అంతరం భారీగా ఉండటం గమనార్హం. ఆయా సంస్థలు.. నిఘా వర్గాలు వేసిన అంచనాలు.. వాస్తవం చూస్తే.. అందరూ ఎంతలా తప్పులో కాలేశారో ఇట్టే అర్థమవుతోంది.

వాస్తవం అంచనాల లెక్క చూస్తే..

పార్టీ వాస్తవం టీవీ 5 ఎన్డీటీవీ టీవీ 9 నిఘా వర్గాలు

టీఆర్ఎస్ 99 77 75-85 78-82 80-85

మజ్లిస్ 44 41 40-45 35-40 25-30

టీడీపీ-బీజేపీ 05 24 20-25 28-34 22-25

కాంగ్రెస్ 02 07 10-12 08-10 08-12

ఇతరులు 0 01 01-03 01-03 0