Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఫలితాల్లో ఎన్నో షాకులు!

By:  Tupaki Desk   |   5 Feb 2016 1:05 PM GMT
గ్రేటర్ ఫలితాల్లో ఎన్నో షాకులు!
X
ఊహంచిన విధంగానే టీఆర్ ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో విజయ ఢంకా మోగిస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ వంద సీట్ల మార్కును చేరింది. ఆ పార్టీ శ్రేణులు కూడా ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు. టీడీపీ రెండంకెలకు కూడా ఇంకా చేరలేదు. ఇందులో హైలెట్స్ ను పరిశీలిస్తే...

* సీమాంధ్ర ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ టీఆర్ ఎస్ గెలిచింది.

* మెజారిటీ విషయంలో టీఆర్ ఎస్ చాలా ముందంజలో ఉంది.

* కాంగ్రెస్ కు ఇప్పటివరకు మూడు సీట్లే వచ్చాయి.

* గుడిమల్కాపూర్ - మాదాపూర్ వంటి ఊహించని సీట్లు కూడా టీఆర్ ఎస్ కు వచ్చాయి.

* సెటిలర్ల ప్రాంతాల్లో టీడీపీకి పలు షాకులు తగిలాయి.

*మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆలకుంట సర్వసతి చేతిలో ఓటమి పొందారు

*తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ బోణీ కొట్టి, కేవలం నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఫలితాల సరళి ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కు మించి కార్పొరేట్ సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదు

*కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా పటాన్ చెరు డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం పొందారు. అలాగే మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే

* ఓల్డ్ సిటీలో మజ్లిస్ హవా తగ్గింది.

* ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 13 డివిజన్లకు పదకొండు టీఆర్ ఎస్ కే దక్కాయి.

* అధికార పార్టీకి ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేరు.

* గోషామహల్ లో బీజేపీ, ఎర్రగడ్డలో ఎంఐఎం గెలిచింది.

* కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కూడా ఓడిపోయారు.

* మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూతురు కొడుకు ఇద్దరూ ఓడిపోయారు.

* కూకట్ పల్లి - వెంగళరావ్ నగర్ డివిజన్లలో అత్యధికులు సీమాంధ్రులే. అక్కడ కూడా టీఆర్ ఎస్ అభ్యర్థులు గెలిచారు.

* టీఆర్ ఎస్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓడిపోయింది.

* సీతాఫల్ మండిలో టీఆర్ ఎస్ అభ్యర్థికి దాదాపు పదిహేను వేల మెజార్టీ వచ్చింది. చాలా చోట్ల మెజారిటీ పదివేలు దాటింది.

* ఎన్నికల ఫలితాల్లో ఊహించినదాని కంటే అధికార టీఆర్ ఎస్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది.

* టీడీపీ కేపీహెచ్ బీ - ఆర్కేపురం బీజేపీ - ఝాన్సీబజార్ - గోషామహల్ బీజేపీ - ఆర్కే పురం బీజేపీ దక్కించుకున్నాయి.

* గ్రేటర్ ఫలితాలపై రాత్రి ఏడు గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ !

* కవిత - కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.

* ఖైరతాబాద్ లో కాంగ్రెస్ దివంగత నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి పన్నెండు వేల మెజార్టీతో గెలిచింది.

* పలు ఎంఐఎం సీట్లను కూడా టీఆర్ ఎస్ గెలుచుకుంది.

* ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ దాటే అవకాశమే కనిపించడం లేదు.

* ఎంఐఎం మద్దతు లేకుండానే టీఆర్ ఎస్ మేయర్ పదవిని దక్కించుకుంది.

*సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్ ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్ ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్ - బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.

* అత్తాపూర్లో టీడీపీ గెలిచింది.

* తెలుగుదేశం ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించింది.

* కొండాపూర్ - గచ్చిబౌలి - వివేకానందనగర్ - సనత్ నగర్ - మాదాపూర్ - వెంగళరావునగర్ - మియాపూర్ లు వంటి ప్రాంతాలు టీఆర్ ఎస్ కు దక్కడం విశేషం.

* కేటీఆర్ ప్రెస్ మీట్ : కొత్త చరిత్రకు టీఆర్ ఎస్ నాంది వేసింది. హైదరాబాదులో ఇదే అతిపెద్ద రికార్డు. అన్ని హామీలు తూ.చ. తప్పకుండా అమలు చేస్తాం. టీఆర్ ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి. టీఆర్ ఎస్ ప్రాంతాలకు కులాలకు అతీతం. హైదరాబాదు ప్రజలు కోరుకున్న హైదరాబాదును నిర్మించడానికి కచ్చితంగా కృషిచేసి రుణం తీర్చుకుంటాం. కేసీఆర్ కు ఎన్నికలు సలాం చేస్తాయి. అపుడు ఇపుడు ఎపుడూ! మేము విజయాలకు పొంగిపోం, అపజయాలకు కుంగిపోం. సవాళ్లు ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేస్తాం. ఇది గెలుపు కాదు, ప్రజలు ఇచ్చిన బాధ్యత. ప్రతి పక్షాలు ఈ తీర్పుతో మారి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాం.

* రేవంత్ ప్రెస్ మీట్ : ప్రజలు టీఆర్ ఎస్ ను గెలిపించాలని భావించారు. నేను సవాల్ చేయలేదు. కేటీఆర్ చేసిన సవాలును స్వీకరించి స్పందించాను. ఆ తర్వాత సవాల్ నుంచి వెనక్కు తప్పుకున్నట్టు మీట్ ద ప్రెస్ లో కేటీఆర్ చెప్పారు. నాది సవాలు కాదు - స్పందన. ఓటింగ్ పెరిగినా టీఆర్ ఎస్ పార్టీయే గెలిచేది. ఈసారి వారికిద్దామని ప్రజలు ఫిక్సయ్యారు.

* మీడియాతో రేవంత్: ఏ పార్టీ అయినా ఓడుతాయి. గెలుస్తాయి. కేటీఆర్ అందరూ హైదరాబాదీలే అన్న మాటకు కట్టుబడాలి. బీజేపీ రెండు సీట్ల నుంచి మూడొందల సీట్లకు వచ్చింది. కాంగ్రెస్ 400 సీట్ల నుంచి 44 సీట్లకు వచ్చింది. కాబట్టి ఇపుడు భారీగా గెలిచామని ఎపుడూ వారే గెలుస్తారని కాదు. ఇక ఆంధ్రా-తెలంగాణ పదాలకు కాలం చెల్లిందని కేసీఆర్ అన్నారు. దానికి కట్టుబడి ఉంటే చాలు. ​

* 11వ తేదీన మేయర్ ఎన్నిక: కేటీఆర్

* కాంగ్రెస్ ఒక సీటుకు పడిపోయింది. అది కూడా హైదరాబాద్ ఆవల.. పటాన్ చెరు డివిజన్

* డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొడుకు (టీఆర్ ఎస్) ఓడిపోయారు.