Begin typing your search above and press return to search.

ప్ర‌పంచంలోనే మ‌న న‌గ‌రాలు చాలా బెస్ట్ అట‌

By:  Tupaki Desk   |   22 March 2017 5:30 PM GMT
ప్ర‌పంచంలోనే మ‌న న‌గ‌రాలు చాలా బెస్ట్ అట‌
X
మ‌న దేశ న‌గ‌రాల‌కు మ‌రో గుర్తింపు ద‌క్కింది. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో జీవనం కొనసాగించగల తొలి 10 నగరాల జాబితాలో దేశంలోని ప్ర‌ముఖ మెట్రో న‌గ‌రాలైన బెంగళూరు - ఢిల్లీ - ముంబై - చెన్నై చోటు దక్కించుకున్నాయి. అత్యంత ఎక్కువ ఖర్చయ్యే నగరంగా వరుసగా సింగపూర్ నాలుగోసారి అగ్రస్థానంలో ఉన్నట్టుగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచ జీవన వ్యయాల -2017 నివేదికను ఈఐయూ విడుదల చేసింది. ఈ సర్వే కోసం 160 రకాల వస్తువులు - సేవల ధరలను తీసుకున్నారు. అందులో ఆహార పదార్థాలు - పానియాలు - దుస్తులు - గృహోపకరణాలు - వ్యక్తిగత అలంకరణ వస్తువులు - ఇంటి కిరాయి - రవాణా - స్కూల్ ఫీజులు - కరెంటు - సెల్‌ ఫోను తదితర బిల్లులు ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చును ఆయా నగరాలతో పోల్చి చూశారు.

ప్రపంచంలోనే అతి తక్కువ జీవన వ్యయం ఉన్న నగరంగా నైజీరియాకు చెందిన లాగోస్ అగ్రస్థానంలో ఉండగా, మూడో స్థానంలో బెంగళూరు - ఆరో స్థానంలో చెన్నై - ఏడో స్థానంలో ముంబై - 10వ స్థానంలో న్యూఢిల్లీ ఉన్నాయి. కరాచీ (4) అల్జీర్స్ (5) - కియెవ్ (8) బుకరెస్ట్ (9) ఉన్నాయి. అత్యధిక వ్యయం అయ్యే నగరంగా అగ్రస్థానంలో సింగపూర్ నిలువగా - రెండో స్థానంలో హాంకాంగ్ - మూడో స్థానంలో జ్యూరిచ్ ఉన్నాయి. టోక్యో (4) - ఒసకా(5) - సియోల్(6) - జెనీవా(7) - ప్యారిస్ (8) - న్యూయార్క్ (9) - కొపెన్‌ హగెన్(10) స్థానాల్లో ఆసియా ఖండం నుంచే అత్యంత తక్కువ జీవన వ్యయం, అత్యధిక జీవన వ్యయం అయ్యే నగరాలు తొలి 10 స్థానాలో ఎక్కువగా ఉండడం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/