Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణయం ఫలితం..ఐదుగురి దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   18 Jun 2018 10:15 AM GMT
ట్రంప్ నిర్ణయం ఫలితం..ఐదుగురి దుర్మ‌ర‌ణం
X
అమెరికాలోకి అక్రమ వలసలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ఈ విష‌యంలో ఉక్కుపాదం మోపాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధికారుల‌కు ఇచ్చిన స్ప‌ష్ట‌మైన ఆదేశాలు క‌ఠినంగా అమ‌లు అవుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను పోలీసులు చేజ్ చేస్తుండ‌గా..జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు.

టెక్సాస్ స‌మీపంలోని డిమిట్ కౌంట్‌ కి పోలీస్ ప్ర‌తినిధి మ‌రియ‌న్ బాడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మెక్సికో బార్డ‌ర్ వ‌ద్ద బిగ్ వేల్స్ స‌మీపంలో ఎస్‌ యూవీ వాహ‌నం ఒక‌టి అనుమాస్ప‌దంగా క‌నిపించ‌డంతో బార్డ‌ర్ పెట్రోలింగ్ పోలీసులు ఆ వాహానాన్ని వెంటాడారు. గంట‌కు 100 మైళ్ల వేగంతో వెళుతున్న ఆ వాహ‌నాన్ని తాము చేజ్ చేయాల‌ని చూసిన స‌మ‌యంలో వారు మ‌రింత వేగం పెంచార‌ని, దీంతో తాము సైతం మ‌రింత వేగంగా ముందుకు సాగాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఈ స‌మ‌యంలో ఆ వాహనం రోడ్డు ప్ర‌మాదానికి గురై అందులో ఐదుగురు మ‌ర‌ణించార‌ని బాడ్ వివ‌రించారు. మొత్తం 14 మంది అందులో ఉన్న‌ట్లుగా గుర్తించామ‌ని, వాహ‌నం డ్రైవ‌ర్‌ ను అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి ఆయ‌న మ‌రిన్ని అంశాలు వెల్ల‌డిస్తూ ఘ‌ట‌న స్థ‌లంలో న‌లుగురు చ‌నిపోయార‌ని, ఆస్ప‌త్రిలో ఒక‌రు మృత్యువాత ప‌డ్డార‌ని తెలిపారు. మ‌నుషుల‌ అక్ర‌మ ర‌వాణ‌ - డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌ ను అరిక‌ట్టేందుకు చేస్తున్న త‌నిఖీల్లో భాగంగా బిగ్ వేల్స్‌ పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన‌ట్లు వివ‌రించారు.

కాగా, తాను అధ్యక్షుడినైతే వలసదారులపై ఉక్కు పాదం మోపుతానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ అమెరికా దేశాల్లోని నిరుపేదలు - కల్లోల జీవితం గడుపుతున్నవారు అక్రమంగా సరిహద్దులు దాటుతూ అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇవి బాగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాలో చొరబడుతున్న వారిలో సగం మంది మెక్సికో నుంచి వస్తున్నవారే కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు మెక్సికో సరిహద్దులో 4.10 లక్షల మంది వలసదారులను అదుపులోకి తీసుకోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్‌ అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ కడతానని చెప్పారు.