ఆ మాజీ సీఎం కరెంటు దొంగ

Fri Apr 21 2017 14:41:31 GMT+0530 (IST)

ఉత్తరాదికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు విచిత్రమైన కేసుల్లో చిక్కుకుంటునట్నారు. ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలిగించేవే అయినా చిల్లర విషయాల్లోనూ కక్కుర్తి పడి పరువు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు పశువుల దాణాలోల చిలక్కొట్టుడు కొట్టి పరువు పోగొట్టుకున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరిగానే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కూడా చిన్న విషయంలో కక్కుర్తి పడ్డారు. ఇంతకాలం ఇది గుట్టుగా సాగిపోయినా ఓ అగ్రి ప్రమాదం ఇప్పుడాయన దొంగతనాన్ని బయటపెట్టేసింది.
    
సమాజ్ వాదీ పార్టీ అధినేత - యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కరెంట్ దొంగ అని బయటపడింది. ఉత్తర ప్రదేశ్ లోని ఇటావాలోని ములాయం నివాసంలో నిన్న చిన్న అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మాజీ సీఎం... జాతీయ పార్టీ అధినేత కావడంతో  విద్యుత్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.  మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు.
    
అక్కడితో ఆగని సిబ్బంది ఎందుకిలా జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేయడానికి సిద్ధమయ్యారు.  విద్యుత్ మీటర్ ను పరిశీలించారు. అంతే... అసలు సంగతి బట్టబయలైపోయింది. ములాయం ఇంట్లో కరెంటు దొంగతనం భారీ ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించారు.  ములాయం సాబ్ కరెంటు బిల్లులను ఎగ్గొడుతున్నట్లు వెల్లడైంది.
    
ములాయం నివాసంలో ఉపయోగిస్తున్నది 5 కిలోవాట్ల మీటర్ కాగా ఆయన వినియోగిస్తున్నది మాత్రం 40 కిలోవాట్ల విద్యుత్ మీటర్.  ఆ లెక్కన ఇప్పటివరకు ఎంత దొంగతనం చేశారన్నది కేలిక్యులేట్ చేయడంతో  ఆయన విద్యుత్ సంస్థలకు ఆయన నాలుగు లక్షల రూపాయలు బకాయి పడ్డారని తేలింది. అలా ఒక షార్ట్ సర్క్యూట్ ములాయం దొంగతనాన్ని బయటపెట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/