పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన బాలీవుడ్ నిర్మాత

Sat Sep 23 2017 15:41:59 GMT+0530 (IST)

   
ఆయనో పేరున్న బాలీవుడ్ పినీ నిర్మాత.. షారూక్ ఖాన్ తో దిల్ వాలే చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాలు నిర్మించిన వ్యక్తి. కానీ అమ్మాయిలపై మోజుతో చేసిన పనులు ఆయన్ను పోలీస్ స్టేన్లో ఉండేలా చేశాయి.
    
అవును.... కరీం మొరానీ అన్న పేరు చెప్పగానే ఆయన ఫెద్ద నిర్మాతో అందరికీ తెలుస్తుంది. షారూక్ ఖాన్ తో హిట్ సినిమాలు కొట్టిన నిర్మాత ఆయన. కానీ.... ముంబయికి చెందిన ఓ యువతిని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకోవడంతో పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
    
అసలు విషయానికొస్తే.. ముంబయికి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు మొరానీ పోలీసు స్టేషన్ మెట్లెక్సాల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశఆల కోసం ఆమె మొరానీని కలిసిందట. దీంతో ఆయన కూడా అమ్మాయిని చూడగానే ఓకే చెప్పి చాన్సిప్పిస్తానని చెప్పి తన వెంట తిప్పుకున్నారట. ఆ తరువాత ముంబయి - హైదరాబాద్ లలో పలుమార్లు ఆమెతో గడిపి అత్యాచారం చేశారట. దీంతో ఆమె ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పెద్దగా స్పందించకపోవడంతో హైదరాబరాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ను కలిసింది. అంతా విన్న ఆయన హయత్ నగర్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో వారు కరీం మొరానీపై కేసు పెట్టారు.
    
పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. మొరానీ ఆ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా అదంతా సెల్ ఫోన్లో చిత్రీకరించి దాన్ని చూపించి ఆమెను బెదిరించారట. దీంతో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు మొరానీకి నోటీసులు పంపారు. దీంతో కేసు బిగుసుకోవడంతో ఆయన పోలీసులకు లొంగిపోయారు.
    
ఇంకో విషయం ఏంటంటే... మొరానీకి ఈ బాధిత యువతి పరిచయం అయింది ఆయన కుమార్తె వల్లే. మొరానీ కుమార్తకు బాధితురాలు ఫ్రెండ్. అలా ఫరిచయం అయిన అమ్మాయిని తన కూతురిని స్నేహితురాలిని దారుణంగా హింసించాడట మొరానీ. మొత్తానికి హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కడంతో ఆయన కథ ఏమవుతుందో చూడాలి.