Begin typing your search above and press return to search.

ప‌దో త‌ర‌గతి పిల్లోడిపై అక్కాచెల్లెళ్ల లైంగిక‌దాడి

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:38 AM GMT
ప‌దో త‌ర‌గతి పిల్లోడిపై అక్కాచెల్లెళ్ల లైంగిక‌దాడి
X
ఇదో చిత్ర‌మైన లైంగిక దాడి కేసు. న‌మ్మ‌లేన‌ట్లుగా ఉండే ఈ ఉదంతం వింటే వ‌రుస షాకులు గ్యారెంటీ. ట్యూష‌న్ కు వ‌చ్చిన కుర్రాడిపై ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు నెల‌ల పాటు లైంగిక‌దాడికి గురి చేసిన ఈ వికృత ఉదంతం వింటే నోట మాట రాదు స‌రిక‌దా.. ఇలాంటి దారుణాలు కూడా మ‌న చుట్టూ జ‌రుగుతున్నాయా? అన్న భ‌యం క‌ల‌గ‌టం ఖాయం. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రా ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

ఆగ్రా ప‌ట్ట‌ణానికి చెందిన ట్యూట‌ర్ ద‌గ్గ‌ర‌కు ట్యూష‌న్ కోసం ప‌దో త‌ర‌గ‌తి కుర్రాడు వ‌చ్చేవాడు. ట్యూష‌న్ చెప్పే ఆవిడ‌కు పాతికేళ్ల వ‌ర‌కూ ఉంటాయి. ఆమెకు 20 ఏళ్ల చెల్లెలు ఉంది. ట్యూష‌న్‌ కు వ‌చ్చిన ఆ కుర్రాడికి మ‌త్తుమందు ఇచ్చిన అక్కా చెల్లెళ్లు అత‌డిని అస‌భ్య‌క‌ర రీతిలో ఫోటోలు తీసి బ్లాక్ మొయిల్ చేయ‌టం మొద‌లెట్టారు.

పోర్న్ వీడియోలు చూపించి.. త‌మ‌ను కూడా అదే రీతిలో లైంగిక కార్య‌క‌లాపాలు సాగించాల‌ని ఒత్తిడి చేసేవారు. ఈ ఎపిసోడ్ లో మ‌రింత ఆరాచ‌కం ఏమిటంటే.. ఆ కుర్రాడి మీద అక్కాచెల్లెళ్లు జ‌రిపే లైంగిక దాడిని వారి సోద‌రుడు వీడియో తీసేవాడు.

దాదాపు తొమ్మిది నెల‌ల పాటు సాగిన ఈ ఆరాచ‌కం ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందంటే.. ట్యూష‌న్ కుర్రాడిని బెదిరించి.. అత‌డి ఇంటి నుంచి న‌గ‌లు తెప్పించుకునేవారు. దీన్ని భ‌రించ‌లేని ఆ కుర్రాడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆగ్రా కెహ్రీ ఘాట్ ప్రాంతంలో ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు. తాము చేసిన పాడు ప‌ని బ‌య‌ట‌కు రావ‌టంతో ట్యూష‌న్ అక్కాచెల్లెళ్లు ప‌రారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.