Begin typing your search above and press return to search.

సిరంజీ సైకో దొరికాడా...

By:  Tupaki Desk   |   31 Aug 2015 8:35 AM GMT
సిరంజీ సైకో దొరికాడా...
X
మహిళలపై ఇంజక్షన్లతో దాడులు చేస్తున్న సైకో సూదిగాడిగా అనుమానిస్తున్న ఓ వ్య‌క్తిని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మండ‌లం శివ‌దేవుని చిక్కాల‌లో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 18 మందిపై ఇంజ‌క్ష‌న్‌ తో దాడి చేసిన ఈ సైకో గాడి కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులంద‌రు ఎక్క‌డిక‌క్క‌డ బృందాలుగా ఏర్ప‌డి అన్వేషిస్తున్నారు.

తాజాగా సోమ‌వారం శివ‌దేవుని చిక్కాల‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం పెంట‌పాడు మండ‌లంలో ఓ వ్య‌క్తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి దాడి చేయ‌డంతో సైకో సూదిగాడు ఒక్క‌డే కాదు..వారు ఎంత‌మంది ఉన్నార‌నే దానిపై ప‌లు అనుమానాలు రేకెత్తాయి. సోమ‌వార‌మే తూర్పుగోదావ‌రి జిల్లా బొబ్బ‌ర్లంక‌లో కూడా పోలీసులు మ‌రో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్య‌క్తి గురించి ఇంకా పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.