అనిల్ అంబానీ సేఫ్.. ఫ్రాన్స్ రాయబారి స్పష్టం

Mon Apr 15 2019 11:28:30 GMT+0530 (IST)

రాఫెల్ కుంభకోణం బీజేపీని అంత తేలిగ్గా వదలడం లేదు. తనకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మేలు చేసేలా రాఫెల్ కాంట్రాక్ట్ ను  ప్రధాని మోడీ ఇప్పించాడని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు మద్దతుగా తాజాగా ఫ్రాన్స్ కు చెందిన లీమాండ్ అనే జాతీయ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రాఫెల్ డీల్ సెట్ అయినందుకు కృతజ్ఞతగా ఫ్రాన్స్ ప్రభుత్వం రిలయన్స్ ఫ్రాన్స్ టెలికాం సంస్ధ ద్వారా అనిల్ అంబానీ బకాయిపడ్డ 1123 కోట్ల రూపాయలను మాఫీ చేసిందని ఆధారాలతో సహా బయటపెట్టి బాంబు పేల్చింది.కాగా ఈ కథనంపై పెద్ద ఎత్తున ఖండనలు కొనసాగాయి. ఇటు భారత రక్షణ రంగంతోపాటు ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా కథనం తప్పు అని స్పష్టం చేశారు. తాజాగా భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ లీమాండ్ పత్రిక కథనాన్ని ఖండించారు. ఈ కథనం పూర్తిగా తప్పు అని.. రిలయన్స్ ఎఫ్ ఎల్ ఏజీ సంస్థ మధ్య కుదిరిన అవగాహన మేరకే పన్ను మినహాయింపులు లభించినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం చట్టాలకు - పన్నుల శాఖ రూల్స్ కు లోబడి జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో మోడీ సహా ఏ రాజకీయ పార్టీ జోక్యం లేదన్నారు.

కాగా ఈ కథనాన్ని అటు ఫ్రాన్స్ ఇటు భారత ప్రభుత్వం ఖండించడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఊరట చెందారు.