సకుటుంబ సపరివార రాజకీయాలు..

Tue May 15 2018 09:37:23 GMT+0530 (IST)

భారతీయ జీవన వ్యవస్థకు కుటుంబమే మూల బిందువు.. ఉమ్మడి కుటుంబాలు కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఆనందంగా హాయిగా ఉండేవారు.. రానురాను ఆర్థిక - సామాజిక - రాజకీయ - కుటుంబ - ఉద్యోగ తదితర కారణాల నేపథ్యంలో కుటుంబాలు విడిపోతున్నాయి. విదేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎప్పుడో చిన్నాభిన్నమైంది. భారత్ లో మాత్రం పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాల ప్రాధాన్యం పెరిగింది. కుటుంబ విలువలను తెలిపేందుకు ప్రతి ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా  ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబాలపై ఓ లుక్ వేద్దాం..*బాబుకు ఒక్క కొడుకే ముద్దు..

తెలుగు రాష్ట్రాల్లో చీకు చింత లేని ఫ్యామిలీ ఏదైనా ఉందటే అది చంద్రబాబుదే.. నాన్న ఏపీ సీఎంగా ఉండగా.. కొడుకును కూడా మంత్రి ని చేసేసి పరిపాలన సాగిస్తున్నారు. మాటల్లో చేతల్లో కాస్త తడబాటు ఉన్నా మన చినబాబు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. వారసత్వ రాజకీయాలాను కంటిన్యూ చేస్తున్న బాబు.. తన తర్వాత తన కొడుకు లోకేష్ ను ప్రొజెక్టు చేస్తున్నారు.. కానీ మన చినబాబే రాజకీయాల్లో వివిధ సందర్భాల్లో దెబ్బైపోతూ అభాసుపాలవుతున్నారు.

*కేసీఆర్ - ఆయన పిల్లలు..
ఉద్యమకాలం నుంచే కేసీఆర్ తన పిలల్లిద్దరిని కార్యక్షేత్రంలోకి దించారు. ప్రజల్లోకి పంపి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిపించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్.. కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేస్తూ నెక్ట్స్ సీఎం అయ్యే రీతిలో సానబెడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో అధికారంలో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. కేటీఆర్ - కవిత - కేసీఆర్ మేనల్లుడు హరీష్ - కేసీఆర్ తోడల్లుడి కొడుకు సంతోష్ కుమార్ లు వివిధ పదవుల్లో ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉండి సకుటుంబ సుపరిపాలన అందిస్తున్నారు..

* తండ్రి మరణంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన  వైసీపీ అధినేత జగన్ కుటుంబ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం. తల్లి విజయమ్మ - సోదరి షర్మిలను రాజకీయాలనుంచి తప్పించి ఆదర్శ రాజకీయాలను ప్రోత్సహించారు. ఒక్కడే బరిలోకి దిగి ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు.

* తెలంగాణ ప్రతిపక్ష నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లోని తన ఫ్యామిలీని తీసుకొచ్చారు. ఉత్తమ్ గెలవడంతో పాటు ఆయన భార్యను ఎమ్మెల్యేగా పోటీచేయించి గడిచిన సారి గెలిపించుకున్నారు. కాంగ్రెస్ లోని చాలా మంది నేతలు తమ వారసులుగా కొడుకులను రంగంలోకి దించుతున్నారు..

*ఇక ఈ వారసత్వ కుటుంబ రాజకీయాలకు కంప్లీట్ వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్.. ఈయన ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చి కుటుంబాన్ని ఇందులో ఇన్ వాల్వ్ చేయడం లేదు. సోదరుడు నాగబాబు జనసేనలోకి వద్దామన్నా పవన్ వద్దంటూ కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

*కుటుంబ రాజకీయాలు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోడీజీనే.. మోడీకి అసలు ఫ్యామిలీనే లేదు. భార్యతో ఎప్పుడో విడిపోయిన ప్రధాని.. ఆయన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో లేరు..   ఒక్కరే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

ఇలా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వేళ రాజకీయ నేతల కుటుంబాల చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.. ఎక్కువమంది నేతలు తమ కుటుంబ సభ్యులను వారసులుగా తెరపైకి తీసుకొచ్చారు.