Begin typing your search above and press return to search.

ఇంద్రాణీ...ప్రేమికుల లిస్ట్ ఇది

By:  Tupaki Desk   |   1 Sep 2015 6:51 AM GMT
ఇంద్రాణీ...ప్రేమికుల లిస్ట్ ఇది
X
షీనా బోరా హత్యకేసులో నిందితురాలు అయిన ఇంద్రాణీ వ్య‌క్తిగ‌త అంశాలు రోజురోజుకు వెలుగులోకి వ‌స్తూ...ఆస‌క్తిక‌ర క‌థ‌నాల‌ను వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీ ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉంది. ఇంద్రాణి కేసులో పోలీసులు ఒక పక్క తవ్వకాలు జరుపుతూ వాస్తవాలు వెలికితీస్తుంటే మరో పక్కన ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ప్రేమవ్యవహారాలు ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి. ఇంద్రాణి ప్రియులు..ఒకరో ఇద్దరో కాదు ఏకంగా నలుగురట..

1. చౌధురి: ఇతను గువహాటి న్యాయవాది. ఇంద్రాణి టీనేజ్ లో ఉన్నప్పుడు ఇతగాడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గువహాటి కాటన్ కాలేజీలో కలిసిచదువుకున్నారు. అప్పుడే వీరి నడుమ ప్రేమ అంకురించింది. ఈ విషయం చౌధురి స్వయంగా మీడియాకు చెప్పారు. ఇంద్రాణి టీనేజ్ నుంచి చాలా అందంగా ఉండేదట. దీంతో.. యువకులు వెర్రెత్తిపోయారు. చివరకు చౌధురి ప్రేమలో పడ్డాడు. `నీకేం కావాలో చెప్పు…’ అనడం ఆల‌స్యం, వెంటనే కోరిక చిట్టా విప్పేసేదని ఈ ప్రేమికుడు చెప్పాడు. కాలేజీ చదువయ్యాక ఇంద్రాణి టపా కట్టేసి షిల్లాంగ్ కు జంప్ చేసింది.

2. సిద్ధార్థ్ దాస్ : ఇంద్రాణి షిల్లాంగ్ లో ఉండగానే ఒక ప్రొఫెసర్ తో ప్రేమలో పడింది. అతడే సిద్ధార్థ్ దాస్. సిద్దార్థ్ దాస్ తల్లి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు షిల్లాంగ్ లో ఉండగా ఇంద్రాణితో ప్రేమలో పడ్డాడనీ, తర్వాత వీరిద్దరూ వివాహంకూడా చేరసుకున్నారని విలేఖరులకు వెల్లడించారు. హత్యకు గురైన షీనా బోరా మరెవరిబిడ్డోకాదనీ, వీరిద్దరికి పుట్టినదేనని కూడా ఆమె తేల్చిచెప్పారు. షీనానేకాదు, షీనాకు సోదరుడున్నాడని ఈ కేసు విచారణలో బయటపడింది. అతనే మిఖాయిల్ బోరా. ఈ కుర్రాడుకూడా వీరిద్దరి (ఇంద్రాణి- సిద్ధార్థ్ దాస్) సంతానమేనట. ఆతర్వాత కొన్నాళ్లకు ఇంద్రాణి షిల్లాంగ్ వదిలేసి కోల్ కతా చేరింది.

3. సంజీవ్ ఖన్నా: షిల్లాంగ్ లో సీన్ కట్ చేస్తే కోల్ కతలో ప్రేమ కథమళ్ళీ మొదలైంది. సంజీవ్ ఖ‌న్నా కోల్ కతాలో మాంచి బిజినెస్ మ్యాన్. కోట్లకు పడగలెత్తాడు. ఎవరు ఏది కోరినా ఆ కోరికను చిటికలో తీర్చగలడు. అలాంటి దమ్మున్న వ్యక్తిని ఇంద్రాణి ఆరాధించింది. చిటికలో ప్రేమగా మార్చేసుకుంది. తర్వాత వీరిద్దరికి పెళ్లయింది. సంజీవ్ ఖన్నా రియల్ ఎస్టేట్ లోకి దిగి ఆర్థికంగా బాగాఎత్తుకు ఎదిగాడు. కొన్నాళ్లు కాపురం చేశాక ఇంద్రాణి మాజీభర్త అయ్యాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కోవడంలో ఇంద్రాణి తనను మోసంచేసిందని తలపట్టుకువాపోతున్నాడు.

4. పీటర్ ముఖర్జియా : ఇతను మీడియాలో ఉన్నత పదవులు అలంకరించిన వ్యక్తి. 1997 నుంచి 2007వరకు స్టార్ ఇండియా టివీఛానెల్ కు సీఈఓగా వ్యవహరించారు. ఐఎన్ఎక్స్ మీడియాకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ గా చేరారు. 2009లో ఆ కంపెనీని వదిలేశారు. తర్వాత ఇంద్రాణితో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆయనకు పెళ్లయింది. ఇంద్రాణితో రెండవ పెళ్ళి. పీటర్ ముఖర్జియా మొదటిభార్యకు పుట్టినవాడు రాహుల్. ఈ కుర్రాడు షీనాతో ప్రేమలో పడటంతో ఇంద్రాణికి నచ్చలేదనీ, దీంతో షీనాను అంతమొందించడానికి కుట్రపన్నిందన్న అభియోగంఉంది.

ఈ ర‌కంగా..ఇంద్రాణీ ముఖ‌ర్జీ ప్రేమ బాగోతాల లిస్ట్ కొనసాగింది. ఆఖ‌రికి క‌న్న కూతురును కూడా చంపుకొనే స్థాయికి చేరిపోయింది.