Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లో ‘‘లైక్’’బటన్ ను లాంగ్ ప్రెస్ చేస్తే..?

By:  Tupaki Desk   |   9 Oct 2015 1:26 PM GMT
ఫేస్ బుక్ లో ‘‘లైక్’’బటన్ ను లాంగ్ ప్రెస్ చేస్తే..?
X
ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకొంటూ సరికొత్తగా నిలిచేందుకు ప్రఖ్యాత సోషల్ నెట్ వర్క్ సైట్ ఫేస్ బుక్ విపరీతంగా ప్రయత్నిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే క్రమంలో కొంగొత్తగా వ్యవహరించటం తెలిసిందే. తాజాగా అలాంటి మార్పు ఒకటి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్ ను టెస్ట్ చేస్తుంది.

ఇప్పటివరూ ఏదైనా పోస్ట్ నచ్చితే లైక్.. నచ్చకుంటే డిస్ లైక్ అంటూ రెండు ఆప్షన్లు మాత్రమే ఉండటం.. దీనికి డిస్ లైక్ పదాన్ని తీసివేయాలన్న సూచనలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. డిస్ లైక్ ను తీసేయాలని ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ వినియోగదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్ ను తీసేసి.. ఆరు కొత్త భావోద్వేగాల్ని ఫేస్ బుక్ ఇస్తోంది.

ఈ ఆరు భావోద్వేగాలు చూస్తే.. లవ్.. హాహా.. యే.. వావ్.. శాడ్.. యాంగ్రీ అన్న భావోద్వేగాల్ని అందించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న లైక్ బటన్ ను లాంగ్ ప్రెస్ చేస్తే.. ఈ కొత్త భావోద్వేగాల్ని పోస్ట్ చేసే వెసులబాటు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారని.. అనంతరం మిగిలిన దేశాలకు ఈ విధానాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు.