Begin typing your search above and press return to search.

హల్వా వండాకే బడ్జెట్ వండుతారు..మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   22 Jun 2019 2:05 PM GMT
హల్వా వండాకే బడ్జెట్ వండుతారు..మీకు తెలుసా?
X
వరుసగా సంపూర్ణ మెజారిటీతో ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడం తరువాయి. సొంత మెజారిటీ వల్ల ఎలాంటి సంప్రదింపులు లేకుండా త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజే బడ్జెట్ పనులు మొదలుపెట్టారు. అయితే, ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం మనం చర్చించుకోవాలి.

గత కొంతకాలంగా బడ్జెట్ పనులు మొదలుపెట్టేముందు తియ్యటి ’హల్వా‘ వండి బడ్జెట్ తయారీ అధికార సిబ్బందికి పెట్టడం అనే ఒక సంప్రదాయం కొంతకాలంగా వస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. జూలై 5న ప్రవేశపెట్టనుండటంతో ఈరోజు ఆ పనులు మొదలుపెట్టారు. ఎప్పటిలాగే సాంప్రదాయం ప్రకారం హల్వా తయారు చేశారు. ఆర్థికమ మంత్రి మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వాను పలువురికి వడ్డించారు.

ఈరోజు నుంచి సేకరించిన సమాచారం క్రోడీకరణ... లెక్కలు - కేటాయింపులు అన్నీ తయారుచేయడం - ప్రతులను ముద్రించడం చేస్తారు. వంద మంది అధికారులు రేయింబవళ్లు పనిచేస్తారు. బడ్జెట్ అనేది ముందే లీక్ అవడానికి కుదరదు. అందుకే కేటాయింపులు మొదలైన ఈరోజు నుంచి పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం అయ్యేవరకు ఇందులో పాలుపంచుకున్న అధికారులను ఇంటికి పంపరు. ఫోన్లు కూడా వాడనివ్వరు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది.

ఇంటర్నెట్ - మెయిల్ సౌకర్యం అందుబాటులో ఉండదు. ఫైనాన్షియల్ బిగ్ బాస్ అనుకోండి ఓ రకంగా. ఐఏఎస్ స్థాయి అధికారులు - ప్రభుత్వం ఎన్నో క్రాస్ చెక్ ల తర్వాత మాత్రమే ఆ విభాగంలో నియమించిన అధికారులు కొందరు ఉంటారు. వారికి మాత్రమే ఇంటికి వెళ్లే సదుపాయం ఉంటుంది.

ఇదిలా ఉంటే... మన ఆర్థిక మంత్రి గారు దగ్గరుండి హండీ లోంచి హల్వాను తీసి కొందరు ముఖ్యులకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.