లోక్ సభ సమరంలో సినీతారల సందడి

Fri Mar 15 2019 10:46:53 GMT+0530 (IST)

దేశవ్యాప్తంగా జరిగే 2019 సార్వత్రిక సమరంలో చాలా రాష్ట్రాల్లో సినీతారలు సందడి చేస్తున్నారు. కొందరు పోటీలో నిలబడగా.. మరికొందరు వారికి మద్దతు పలుకుతున్నారు. ఇంకొందరు సొంతంగా పార్టీ స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా చాలా స్థానాల్లో బరిలో దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు నటుడు పవన్ కల్యాన్ జనసేన పార్టీ స్థాపించారు. అదేవిధంగా కన్నడ నటుడు ఉపేంద్ర ప్రజాకీయ పార్టీతో లోక్ సభ సమరానికి సిద్ధమయ్యారు. కాగా తమిళనాడులో ఎంఎన్ ఎం పార్టీతో కమలహాసన్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా చాలామంది నటులు వివిధ పార్టీల తరఫున పోటీలో - ప్రచారంలో ఉన్నారు. వారి గురించి ఓసారి పరిశీలిద్దాం..– తెలంగాణ రాష్ట్రం మెదక్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున విజయశాంతి పోటీ

– అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ

– చిత్తూరు జిల్లా నగరి నుంచి నటి రోజా సెల్వమణి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనున్నారు.

– తెలుగు నటులు జయసుధ - అలీ - దాసరి అరుణ్ - రాజా రవీంద్ర వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు.

– కర్ణాటకలోని 28 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపనున్న ఉపేంద్ర

– మండ్య నుంచి జేడీఎస్ తరఫున సీఎం తనయుడు - సినీనటుడు నిఖిల్ కుమారస్వామి బరిలో దిగారు.

– కర్నాటక రాష్ట్ర మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నటి సుమలత పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు మద్దతుగా కన్నడ నటులు దర్శన్ - యశ్ ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా సీనియర్ నటులు చిరంజీవి - రజనీకాంత్ కూడా వస్తారని సమాచారం.

– బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈమేరకు ప్రచారం మొదలుపెట్టారు.

– కేరళలో నటుడు సురేష్ గోపికి బీజేపీ ఈసారి టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

– తమిళనాడులో ఎంఎన్ ఎం పార్టీ తరఫున అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ వ్యవస్తాపకుడు - నటుడు కమలహాసన్ ప్రకటించారు.