రేప్ బెదిరింపు.. మోడీ ఫాలోవర్ పై ఎఫ్ ఐఆర్

Mon May 27 2019 16:59:29 GMT+0530 (IST)

రెండోసారి దేశంలో అధికారంలోకి వచ్చాక మోడీ బ్యాచ్ రెచ్చిపోతుందనడానికి తాజా నిదర్శనమీ సంఘటన.. మోడీకి వ్యతిరేకులైన వారికి హెచ్చరికలు జారి చేస్తున్నారు. తాజాగా మోడీ ఫాలోవర్ ఒకతను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురిపై ఆన్ లైన్ లో రేప్ చేస్తానంటూ ట్వీట్లు పెట్టి హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అనురాగ్ అయితే ట్విట్టర్ లో మోడీని నిలదీశాడు. అయితే దీనిపై తాజాగా పోలీసులు వారం తర్వాత స్పందించడం విశేషం.  దర్శకుడి కూతురును రేప్ చేస్తానని చెప్పింది మోడీ ఫాలోవర్. అతడి పేరు ‘చౌకీదార్ రాంసంగి’. ఇంతకీ ఇతడు ఎందుకు అలా బెదిరించాడంటే.. అనురాగ్ కశ్యప్ గతంలో చాలా సార్లు మోడీకి వ్యతిరేకంగా నిరసన గళం తెలిపారు. ట్వీట్లు చేశారు. ఇప్పుడు రెండోసారి మోడీ గెలవడంతో రాంసగి అనురాగ్ కూతురికి ట్వీట్ చేసి ‘మోడీపై విమర్శలు ఆపమని మీనాన్నకు చెప్పు లేదంటే  నిన్ను రేప్ చేస్తాం..’ అంటూ దారుణమైన ట్వీట్లు చేస్తూ హెచ్చరించాడు.

ఈ విషయం అనరాగ్ కశ్యప్ కు కూతురు తెలుపడంతో అతడు సీరియస్ అయ్యాడు. మోడీ ఫాలోవర్ ట్వీట్ ను మోడీకి ముంబై పోలీసులకు ట్యాగ్ చేసి కామెంట్ చేశారు. ‘మోడీగారు మీరు మరోసారి గెలిచినందుకు అభినందనలు.. మీరు కలుపుకొని పోతున్నా మీ ఫాలోవర్లు వ్యతిరేకులను బెదిరిస్తున్నారు. నా కూతురిని రేప్ చేస్తానంటూ కొందరు మీ విజయాన్ని ఇలా జరుపుకుంటున్నారు.. నన్ను మీ వ్యతిరేకుడినంటూ ఈ చర్యకు దిగుతున్నారని’ అనురాగ్ కశ్యప్ రీట్వీట్ చేసి మోడీకి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా అనురాగ్ కశ్యప్  ఫిర్యాదు తర్వాత రంగంలోకి దిగిన  ముంబై పోలీసులు అతడి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విచారణ జరిపారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతడి ఆచూకీ కనిపెట్టారు.  వెంటనే సదురు వ్యక్తిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ ఐఆర్ కాపీ ట్యాగ్ చేసి ముంబై పోలీసులు ట్విట్టర్ లో అనురాగ్ కు రిపోర్ట్ చేశారు. దీనిపై పోలీసులకు మోడీకి అనురాగ్ కృతజ్ఞతలు తెలిపారు.