Begin typing your search above and press return to search.

ట్రంప్ అల్లుడిని ఎఫ్‌ బీఐ బుక్ చేస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   26 May 2017 6:59 AM GMT
ట్రంప్ అల్లుడిని ఎఫ్‌ బీఐ బుక్ చేస్తుంద‌ట‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ రాజ‌కీయాల్లో మొద‌టి క‌ల‌క‌లం మొద‌లైంది. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్న‌ర్ చిక్కుల్లో ప‌డ్డాడు. దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో రిప‌బ్లిక‌న్ పార్టీ గెలుపు కోసం ర‌ష్యా జోక్యం చేసుకున్న‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎఫ్‌బీఐ ద‌ర్యాప్తు చేప‌డుతోంది. అయితే ఆ కేసులో కుష్న‌ర్‌ను కూడా విచారించాల‌ని ఎఫ్‌బీఐ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ ఓట‌మి కోసం ర‌ష్యా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఆ అంశానికి సంబంధించిన స‌మాచారం ట్రంప్ అల్లుడి ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు అనుమానాలు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం దేశాధ్య‌క్షుడు ట్రంప్‌ కు సీనియ‌ర్ అడ్వైజ‌ర్‌ గా కూడా కుష్న‌ర్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ష్యా హ్యాకింగ్‌ కు పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు నిజమే అయినా, ఆ నేరంతో కుష్న‌ర్‌ కు ప్ర‌త్యేక సంబంధం ఏమీలేద‌ని మాత్రం ఎఫ్‌ బీఐ విశ్వ‌సిస్తోంది. త‌మ ప్ర‌చార బృందానికి, ర‌ష్యాకు అనుబంధం ఉన్న‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ట్రంప్ కొట్టిపారేశారు. ర‌ష్యా అంశాన్ని విచారిస్తున్న ఎఫ్‌ బీఐకి కుష్న‌ర్ స‌హ‌కరిస్తాడ‌ని ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ తెలిపారు. ఎఫ్‌బీఐ చేప‌డుతున్న విచార‌ణ‌ను ఓ దెయ్యాల వేట అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/