Begin typing your search above and press return to search.

నాటి అవ‌మానానికి బ‌దులు తీర్చుకోవ‌టం ఖాయ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   24 April 2017 4:27 AM GMT
నాటి అవ‌మానానికి బ‌దులు తీర్చుకోవ‌టం ఖాయ‌మ‌ట‌
X
మ‌రో స్వీట్ న్యూస్ క‌మ‌ల‌నాథుల కోసం వెయిట్ చేస్తుంద‌ట‌. దేశ వ్యాప్తంగా మోడీ గాలి ఎంత బ‌లంగా వీస్తుంద‌న్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ కానుంద‌ట‌. దిమ్మ తిరిగి.. మైండ్ బ్లాక్ అయ్యే ఎదురుదెబ్బ త‌గిలిన చోట‌నే.. ఘ‌న విజ‌యం సాధించేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మోడీకి తిరుగులేద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. అంత సీన్ లేద‌న్న‌ట్లుగా తేల్చి చెప్పిన ఢిల్లీ ఓట‌ర్లు రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే మోడీ మీదా.. ఆయ‌న నేతృత్వం వ‌హిస్తున్న పార్టీ మీదా త‌మ మ‌న‌సు మార్చుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఆదివారం జ‌రిగిన ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఘ‌న విజ‌యం ప‌క్కా అని తేల్చి చెబుతున్నారు. మూడు కార్పొరేష‌న్ల‌లో మొత్తం 227 స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ప‌క్కా అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. 2014సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఎదురైన అవ‌మాన‌క‌ర ఓట‌మికి తాజాగా బ‌దులు తీర్చుకోవ‌టం ఖాయ‌మంటున్నారు.

70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న ఢిల్లీ రాష్ట్రంలో కేవ‌లం మూడంటే మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించి.. దారుణ‌మైన ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. అంత దారుణ ప‌రాజ‌యాన్ని ఏమాత్రం ఊహించ‌ని బీజేపీకి ఢిల్లీ ఓట‌ర్లు భారీగానే షాకిచ్చార‌నే చెప్పాలి. ఆ ఎన్నిక‌ల ఫ‌లితం రావ‌టానికి ముందు వ‌ర‌కూ మోడీ గురించి గొప్ప‌లు చెప్పిన వారంతా.. కొద్ది రోజుల పాటు నోరు తెర‌వ‌టానికి కూడా సాహ‌సించ‌లేని ప‌రిస్థితి. త‌ర్వాత ప‌రిస్థితి మార‌టం వేరే విష‌య‌మైనా.. తీవ్ర‌మైన అవ‌మానం ఎదురైన చోట‌.. ఘ‌న విజ‌యం సాధించే దిశ‌గా ప‌య‌నించ‌టం ఆనంద‌క‌ర‌మైన విష‌యంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

కోరి మ‌రీ.. అధికారాన్ని క‌ట్ట‌బెట్టినా.. త‌న చేత‌కానిత‌నంలో.. పాల‌న‌లో త‌న‌కు లేని అనుభ‌లేమిని ప్ర‌ద‌ర్శిస్తూ.. త‌ప్పులు మీద త‌ప్పులు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ కు.. ఈ ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వం ఎదుర‌వుతుంద‌ని చెబుతున్నారు. మూడు కార్పొరేష‌న్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌టం ప‌క్కా అని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. మొత్తం 272స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. బీజేపీ 218 స్థానాల్లోనూ.. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లోనూ.. కాంగ్రెస్ 22 స్థానాల్లోనూ విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల పోలింగ్ మొద‌ట్లో చాలా పేల‌వంగా మొద‌లైన‌ప్ప‌టికీ.. పోలింగ్ ముగిసే స‌మ‌యానికి 54 శాతంగా న‌మోదైంది. 26న విడుద‌ల కానున్న ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మోడీని మ‌రింత శ‌క్తివంతుడిగా తయారు చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/