ఎగ్జిట్ పోల్స్... కేంద్రంలో మళ్లీ మోదీనే

Sun May 19 2019 19:35:28 GMT+0530 (IST)

సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ అయిన ఏడో దశ పోలింగ్ ముగిసిందో - లేదో... వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా కాకుండా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకేసారి వచ్చి పడ్డాయి.  ఒకేసారి రిలీజ్ అయిపోయిన ఈ సర్వేలన్నీ కూడా కూడబలుక్కున్నట్లుగా ఒకే మాటను చెప్పేశాయి. ఆ మాట ఏంటంటే... ఈ సారి కూడా కేంద్రంలో ఎన్డీఏదే అధికారం అనే. ఏ ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్ లో కూడా యూపీఏకు అతి తక్కువ స్థానాలే రావడం గమనార్హం.ఇక అంతా అనుకున్నట్లుగా ఇతరుల కేటగిరీలో ప్రాంతీయ పార్టీలు కూడా ఓ మోస్తరు ప్రభవాాన్నే చూపనున్నాయని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇప్పటిదాకా విడుదలైన రిపబ్లిక్ సీ ఓటర్ - టైమ్స్ నౌ - న్యూస్ ఎక్స్ - ఎన్డీటీవీ - న్యూస్ నేషన్ - రిపబ్లిక్ జన్ కీ బాత్ - న్యూస్ 18... ఇలా దాదాపుగా అన్ని సర్వేలు కూడా ఎన్డీనే మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టబోతోందని తేల్చి చెప్పాయి. ఆయా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే...
 ఎన్డీఏ 287 - యూపీఏ 128 - ఇతరులు 117

టైమ్స్ నౌ...
ఎన్డీఏ 306 - యూపీఏ 132 - ఇతరులు 104

న్యూస్ ఎక్స్  ....
ఎన్డీఏ 298 - యూపీఏ 118 - ఇతరులు 127

ఎన్డీటీవీ...
ఎన్డీఏ 298 - యూపీఏ 128 - ఇతరులు 116

న్యూస్ నేషన్...
ఎన్డీఏ 282-290 - యూపీఏ 118-126 - ఇతరులు 130-138

రిపబ్లిక్ జన్ కీ బాత్...
యూపీఏ 295-315 - యూపీఏ 122-125 - ఇతరులు 102 -125

న్యూస్ 18...
ఎన్డీఏ 292-312 - యూపీఏ 62-72 - ఇతరులు 102-112