Begin typing your search above and press return to search.

టికెట్ల పంచాయ‌తీ: కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ గుడ్‌ బై

By:  Tupaki Desk   |   18 Nov 2018 4:30 PM GMT
టికెట్ల పంచాయ‌తీ: కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ గుడ్‌ బై
X
మీడియా ముందుకు రావ‌డం ఆల‌స్యం కాంగ్రెస్‌ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ పేరు క‌ల‌వ‌రించే కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ మాజీ మంత్రి శంకర్‌ రావుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్‌కు తాను వీర‌విధేయుడిన‌ని చెప్పుకొనే శంక‌ర్‌ రావు ఆ పార్టీ మొండిచేయి చూపించింది. షాద్ న‌గ‌ర్ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో...మాజీ మంత్రి శంకరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు టికెట్‌ రాకపోవడంతో రగిలిపోతున్న ఆయన.. పార్టీ జాతీయ అధ్యక్షుడికి బహిరంగ లేఖ రాశారు. తనను బలిపశువును చేశారంటూ ఆవేదన చెందిన ఆయన.. పార్టీలో విధేయులకు చోటులేదని అన్నారు. కాంగ్రెస్‌ కు మూలస్థంభాలైన చెన్నారెడ్డి - వెంకటస్వామి కుటుంబాలకు పార్టీలో చోటులేకుండా చేస్తారా అంటూ ప్రస్తావించారు.

అయితే,తార్నాక‌లోని సమాజ్‌ వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఆధ్వ‌ర్యంలో శంకర్ రావు పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా శంకర్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ రెడ్ల పార్టీగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 5 సార్లు ఎమ్మెల్యే - 2 మంత్రి పదవి చేసిన తానకు పార్టీ లో తీరని అన్యాయం జరిగిందన్నారు. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మేనిఫెస్టో ను చూసి సమాజ్వాదీ పార్టీ లో చేరానని తెలిపారు. షాద్‌ నగర్ నుండి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, బీసీ - ఎస్సీ - ఎస్టీ నాయకులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తున్న క్ర‌మంలో సోనియా కుటుంబానికి వీర విధేయుడికే టిక‌టె్ ద‌క్క‌లేని ప‌రిస్థితి ఆస‌క్తిక‌రంగా మారింది.