Begin typing your search above and press return to search.

శివ‌సేన‌కు ఎంత ధైర్యం ?!

By:  Tupaki Desk   |   30 Aug 2015 7:47 AM GMT
శివ‌సేన‌కు ఎంత ధైర్యం ?!
X
హిందువులకు శివసేన బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మతం ఆధారిత జన గణనలో హిందువుల వృద్ధి తగ్గుముఖం పడుతూ ముస్లింల సంఖ్య పెరుగుతుండడంపై శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు పిల్లలున్న హిందూ కుటుంబాలకు నజరానా ఇవ్వాలని శివసేన ఆగ్రా శాఖ నిర్ణయించింది. 2010 తరువాత ఐదుగురు పిల్లలను కన్న కుటుంబాలకు రూ.2లక్షల నజరానా ప్రకటించింది.ఈ మేర‌కు శివసేన ఆగ్రా చీఫ్ వీణూ లావణ్య వివ‌రాలు ప్ర‌క‌టించారు.

2010 నుంచి 2015 మధ్య కాలంలో ఐదుగురు పిల్లలున్న దేశంలో ఎక్కడైనా హిందూ కుటుంబాలకు 2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ న‌జరాన‌కు అర్హులైన వారు ఆయా పిల్లల జన్మధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వివ‌రించారు. దేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందని తాజా గణాంకాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిందు జనాభాను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టం చేశారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టాలని, బహుభార్యా విధానాన్ని నిషేధించాలని శివసేన డిమాండ్‌ చేస్తోంద‌ని ప్ర‌క‌టించారు.

మ‌రాఠా షేర్‌ బాల్ ఠాక్రే వార‌స‌త్వంతో న‌డుస్తున్న శివ‌సైనికులు హిందూ మ‌తోద్దార‌ణ‌కోసం కంక‌ణం క‌ట్టుకొని ఇన్నాళ్లు ఉద్య‌మించారు. ఇపుడు జాతి వృద్ధికి సైతం ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు, అది కూడా దేశ‌వ్యాప్తంగా ఈ ఆలోచ‌న‌ను వ‌ర్తింప‌చేసేందుకు శివ‌సేన ధైర్యాన్ని అభినందించాలి అని హిందూ అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.