Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లోకి ఎర్ర‌బెల్లి స‌హా మ‌రో ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   10 Feb 2016 3:54 PM GMT
టీఆర్ ఎస్‌ లోకి ఎర్ర‌బెల్లి స‌హా మ‌రో ఎమ్మెల్యే!
X
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర షాక్‌ ! ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి టీఆర్‌ ఎస్‌ లోకి చేరుతున్న నేప‌థ్యంలో తాజాగా టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. సీఎం కేసీఆర్ మేనల్లుడు - మంత్రి హరీశ్ రావుతో ఎర్ర‌బెల్లి సమావేశమయ్యారు. అనంత‌రం టీఆర్ ఎస్‌ లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం టీఆర్‌ ఎస్‌ లో చేరనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. ఈ ఇద్దరు నేతలు కాసేపట్లో సీఎం కేసీఆర్‌ ను కలవనున్నారు. ఇప్పటికే టీటీడీపీ ఎమ్మెల్యేలు ఏడుగురు గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. తాజా ప‌రిణామంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది. టీడీపీ ఫ్లోర్ లీడర్‌ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు టీఆర్‌ ఎస్ పార్టీలో చేర‌డం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌గా రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరిక‌తో ఏకంగా టీడీపీని టీఆర్ ఎస్‌ లో విలీనం చేసే దిశ‌గా ప‌రిణామాలు మారే అవ‌కాశం ఉంది. ఎర్ర‌బెల్లి కంటే ఒక్క‌రోజు ముందే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ గూటికి చేరిపోయారు.