Begin typing your search above and press return to search.

ఎమ్మేల్యే రేసులో ఉద్యోగ గుర్రాలు

By:  Tupaki Desk   |   16 Aug 2018 6:44 AM GMT
ఎమ్మేల్యే రేసులో ఉద్యోగ గుర్రాలు
X
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైయింది. తెలంగాణలో అయితే గడువుకు ఆరు నెలలమందే ఎన్నికలు జరపాలని ముఖ‌్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు జరగకపోవచ్చు కాని, ఎన్నికల ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. అక్కడ, ఇక్కడ ఎన్నికల బరిలో నిల్చుంనేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు చురుకైన పాత్ర పోషించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆశోక్ బాబు వంటి నాయకులు కూడా సమైక్య ఉద్యమంలో పాల్గున్నారు. తెలంగాణలో స్వామి గౌడ్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా కొందరు ఉద్యోగ నాయకులు ఎన్నికలలో పోటి చేసేందుకు సిద్దంమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితీ - కాంగ్రెస్ పార్టీల నుంచి టికేట్లు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అయితే తెలుగుదేశం - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి బరిలో దిగేందుకు సన్నద్దమవుతున్నారు. వరంగల్ నుంచి పోటి చేసేందుకు టిఎన్జీఓఏ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తన ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి తనకు టికెట్టు కేటాయించాల్సిందిగా కోరారు. అదే జిల్లాకు చెందిన ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుబ్బారావు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు.

టిఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ తరఫున పోటి చేసేందుకు పంగాయితీ రాజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతోద్యోగి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన కార్మిక శేఖలో పనిచేస్తున్న ఓ ఆఫీసర్ కూడా టికేట్టు కోసం ఇటు టిఆర్ ఎస్ నాయకులను - అటు కాంగ్రెస్ నాయకులను కలసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ లో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఈ సారి ఎన్నికలలో పోటి చేయాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆశోక్‌ బాబును తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అలాగే తిరిగి సొంత గూటికి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆశోక్‌ బాబుకు ఫోన్ చేసి కాంగ్రెస్‌ లో చేరాలని ఆహ్వానించారు. అయితే ఆయన మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే కృష్ణా జిల్లానుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. విశాఖపట్నం పంచాయితీ రాజ్ శాఖలోను - జిల్లాపరిషత్‌ లోను కీలకమైన ఉద్యోగాలు చేసిన ఓ అధికారి కూడా ఈ సారి పోటి చేయాలనుకుంటున్నారు. తూర్పుగోదావరికి చెందిన ఆ అధికారి విశాఖ జిల్లా నుంచి పోటి చేయాలనుకుంటున్నారు. ఇంతకు ముందే తన ప్రతిపాదనను చంద్రబాబు ముందుంచిన ఆయన ఈ సారి మాత్రం వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి పోటి చేసే అవకాశం ఉంది.