Begin typing your search above and press return to search.

తెలుగుదేశానికి జాతీయ హోదా రావాలంటే..?

By:  Tupaki Desk   |   30 May 2016 7:25 AM GMT
తెలుగుదేశానికి జాతీయ హోదా రావాలంటే..?
X
ముచ్చటగా మూడు రోజుల పాటు సాగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. పండుగ మాదిరి జరిగిన మహానాడుతో తెలుగు తమ్ముళ్లు ఫుల్ రీఛార్జ్ అయ్యారు. వివిధ అంశాల మీద చర్చలు జరుపుకొని.. భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాల మీద కొత్త లక్ష్యాల్ని పెట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా తీసుకురావటమే లక్ష్యమన్న విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించటం తెలిసిందే.

మరి.. చంద్రబాబు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా రావాలంటే ఏం చేయాలి? ఆ హోదా ఎలా వస్తుంది? అన్న ప్రశ్నలు వేసుకుంటే ఆ హోదా అంత ఈజీ కాదన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే.. దానికి పెద్ద తతంగమే ఉంది మరి. ఏదైనా రాజకీయ పార్టీ జాతీయ పార్టీ హోదా తెచ్చుకోవాలంటే కనిష్ఠంగా మూడు రాష్ట్రాల్లో 11 లోక్ సభ స్థానాల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం చూస్తే.. ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎంపీలు ఉన్నారు. ఇక.. మిగిలింది మరో రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఒక్క ఎంపీ అయినా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ ఒక్క ఎంపీ సీటును గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్ గా జాతీయ పార్టీ హోదా వచ్చేస్తుంది. అయితే.. మరో రాష్ట్రం కింద ఏ రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాబు ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసి.. ఆ రాష్ట్రంలో పార్టీ బలపడి.. ఒక ఎంపీ స్థానం గెలుచుకునే స్థాయికి వెళ్లటం అంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని చెప్పాలి. అంటే.. తెలుగుదేశానికి జాతీయ పార్టీ హోదా రావటం ఇప్పటికిప్పుడు కష్టమని చెప్పక తప్పదు.