Begin typing your search above and press return to search.

ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికల సందడి..

By:  Tupaki Desk   |   18 Jan 2018 8:27 AM GMT
ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికల సందడి..
X
మేఘాలయ - త్రిపుర - నాగాలాండ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 18న - మేఘాలయా - నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 3న మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ర్టాల్లో మేఘాలయలో కాంగ్రెస్ - త్రిపురలో సీపీఎం - నాగాలాండ్‌ లో బీజేపీ సంకీర్ణం అధికారంలో ఉన్నాయి. 2013 ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్ 29 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్కస్థానం కూడా గెలవనప్పటికీ మొన్న డిసెంబరులో కాంగ్రెస్ నుంచి ఒకరు - ముగ్గురు ఇండిపెండెట్లు కలిపి మొత్తం నలుగురు బీజేపీలో చేరారు. దీంతో ఈ రాష్ర్టంపై ఇప్పుడు బీజేపీ కన్నేసింది.

ఇక త్రిపురలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. సీఎం మాణిక్ సర్కార్ ఇక్కడ 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ - బీజేపీలు రెండింటికీ అవకాశాలు ఏమాత్రం లేవు.

ఇక నాగాలాండ్ విషయానికొస్తే అక్కడ ప్రస్తుతం బీజేపీ ఇక్కడ నాగా పీపుల్స్ ఫ్రంట్‌(ఎన్‌ పీఎఫ్)తో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. నిజానికి 2013 ఎన్నికల్లో ఇక్కడ ఎన్‌ పీఎఫ్ 37 - కాంగ్రెస్ 8 - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 4 - బీజేపీ 2 - జేడీయూ 1 - ఇండిపెండెంటు 8 సీట్లు గెలిచారు. ఆ తరువాత బీజేపీ చక్రం తిప్పి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంది.