Begin typing your search above and press return to search.

ఈసీ షాక్‌: రెండాకులు ఎవ‌రివీ కావు

By:  Tupaki Desk   |   23 March 2017 6:06 AM GMT
ఈసీ షాక్‌: రెండాకులు ఎవ‌రివీ కావు
X
అమ్మ పేరు లేకుండా త‌మిళ‌నాడులో ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి ఉంటుందా? అన్న‌ది ఊహ‌కు కూడా అంద‌ని అంశం. కానీ.. అమ్మ పార్టీ గుర్తు అయిన రెండాకులు మాత్రం త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో మాత్రం క‌నిపించే అవ‌కాశ‌మే లేద‌ని చెబుతున్నారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌.. అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త విభేదాల నేప‌థ్యంలో..అటు శ‌శి వ‌ర్గానికి కానీ.. ఇటు ప‌న్నీర్ వ‌ర్గానికి కానీ పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని కేటాయించేది లేద‌న్న విష‌యాన్ని తేల్చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి.. అమ్మ పార్టీ గుర్తు అయిన రెండాకులు త‌మ‌కే చెందాలంటూ రెండు వ‌ర్గాల వారు ఈసీని ఆశ్ర‌యించారు. త‌మ‌దే అస‌లైన అన్నాడీఎంకే పార్టీ అని అటు శ‌శివ‌ర్గం.. ఇటు ప‌న్నీరు వ‌ర్గం ఈసీ ఎదుట వాదించింది. త‌మ‌కు 122 మంది ఎమ్మెల్యేలు.. 37 మంది ఎంపీలు ఉన్నార‌ని.. ప‌వ‌ర్ లో కూడా తామే ఉన్న‌ట్లుగా శ‌శివ‌ర్గానికి చెందిన ఎంపీ న‌వ‌నీత కృష్ణ‌న్ వాదించ‌గా.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ ఎన్నిక చెల్ల‌దంటూ ప‌న్నీర్ వ‌ర్గం వాదించింది.

త‌మ‌కు కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంద‌ని.. అందుకే త‌మ‌కే రెండాకుల గుర్తును కేటాయించాల‌ని ప‌న్నీర్ వ‌ర్గం వాదించింది. ఇరు వ‌ర్గాల వారు సుదీర్ఘంగా వినిపించిన వాద‌న‌ల్ని విన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇరువురికి రెండాకుల గుర్తును కేటాయించ‌కుండా నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఉప ఎన్నిక‌కు రెండు వ‌ర్గాల వారు వేర్వేరు గుర్తుల మీద పోటీ చేయాల‌ని సూచించింది. ఈసీ నిర్ణ‌యంపై శ‌శి వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు పేర్కొంది. మ‌రోవైపు.. రెండు ప‌క్షాల వారు త‌మ‌కు కేటాయించాల్సిన ఎన్నిక‌ల గుర్తును వెల్ల‌డించాల‌ని ఈసీ కోరింది. మొత్తానికి అమ్మ కార‌ణంగా ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అమ్మ పార్టీ గుర్తు క‌నిపించ‌దు. ఈసీ నిర్ణ‌యం శ‌శిక‌ళ వ‌ర్గానికి మింగుడుప‌డ‌ని విధంగా మారిందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/