మాల్యాకు మళ్లీ షాకిచ్చిన ఈడీ

Fri May 19 2017 11:21:07 GMT+0530 (IST)

లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్  విజయ్ మాల్యాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే ఆయనకు చెందిన 6 వేల కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసిన ఈడీ తాజాగా మహారాష్ర్టలోని రాయఘర్ జిల్లాలోని అలీబాగ్ లో ఉన్న ఒక బీచ్ సైడ్ ఫామ్ హౌస్ ను జప్తు చేసింది. దాని విలువ రూ.100 కోట్లు.
    
ఈ ఫామ్ హౌస్ మాల్యాకు చెందిన మాండ్వా ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరు మీద ఉంది. మొత్తం 17 ఎకరాల్లో విస్తరించిన దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈడీ అధికారులు గత ఏప్రిల్ నుంచే చర్యలు మొదలు పెట్టారు. అక్కడున్నవారిని ఖాళీ చేయాలని ఆదేశించారు.
    
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రూ.900 కోట్ల మేరకు ఎగ్గొట్టిన కేసులో మాల్యాపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసుల నేపథ్యంలో మాల్యా లండన్ పారిపోవడం.. ఇటీవలే అక్కడి పోలీసులు ఆయన్న అరెస్టు చేయడం ఆ తరువాత బెయిల్ పై రావడం అంతా తెలిసిందే.  ప్రస్తుతం భారత్ కు రాకుండా లండన్ లో తిష్ఠ వేసిన మాల్యా ను భారత్ కు రప్పించేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/