Begin typing your search above and press return to search.

8 గంట‌ల విచార‌ణ‌!..రేవంత్ గుల్లయ్యారే!

By:  Tupaki Desk   |   20 Feb 2019 4:19 AM GMT
8 గంట‌ల విచార‌ణ‌!..రేవంత్ గుల్లయ్యారే!
X
తొలుత జైలు... ఆ త‌ర్వాత ఓట‌మి.. ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి విచార‌ణ‌లు... వెర‌సి తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్తైపోతున్నారు. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారో... అప్ప‌టి నుంచి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏ ఒక్కటీ అనుకూలించ‌డం లేదు. ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకున్న రేవంత్ రెడ్డి... ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో ఓ కొత్త నేత చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇక ఆ త‌ర్వాత త‌న‌ను జైలు పాల్జేసిన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ కేసు విచార‌ణ నిమిత్తం ఆయ‌న నేడు ఎన్‌ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఎదుట హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఈడీ అధికారుల వ‌ద్ద‌కు వెళితే... రాత్రి 8 గంట‌ల‌కు గానీ ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. మొత్తంగా 8 గంట‌ల పాటు ఈడీ అధికారులు సంధించిన ప్రశ్న‌ల‌తో రేవంత్ రెడ్డి గుల్ల‌య్యార‌నే చెప్పాలి. ఈ విచార‌ణ కూడా చాలా ఆస‌క్తిక‌రంగా సాగినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన ముద్దాయి టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే అయిన‌ప్ప‌టికీ... ఆ మొత్తం వ్య‌వ‌హారాన్ని న‌డిపించేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కైపోయారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ ఓటును కొనుగోలు చేసేందుకు రూ.50 ల‌క్ష‌లను బ్యాగులో వేసుకుని వెళ్లిన రేవంత్‌ ను తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకున్నారు. నేరుగా జైలుకు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత బెయిల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన రేవంత్ రెడ్డి... అనూహ్యంగా టీడీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌ లో చేరిపోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దిపిన రేవంత్ తానే ఓడిపోయారు. ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో నాటి ఓటుకు నోటు కేసుకు మ‌ళ్లీ బూజు దులిపిన ఏసీబీ - ఆదాయ‌ప‌న్ను శాఖ‌లు విచార‌ణ‌ను మొద‌లుపెట్టేందుకు రంగం సిద్దం చేయ‌గా.. ఇప్పుడు కొత్త‌గా ఈడీ కూడా రంగంలోకి దిగేసింది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు - కేసులో మ‌రో నిందితుడిగా ఉన్న ఉద‌య సింహ‌ల‌ను ఇప్ప‌టికే విచారించిన ఈడీ... తాజాగా రేవంత్‌ కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న రేవంత్ నేటి ఉద‌యం 11.30 గంట‌ల‌కు హైద‌రాబాదులోని ఈడీ కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డ ఈడీ అధికారుల‌తో పాటు ఏసీబీ - ఐటీ అధికారులు కూడా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికి త‌మ‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌తో ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. విచార‌ణ‌లో భాగంగా ఓ గ‌దిలో ఏసీబీ - మ‌రో గ‌దిలో ఐటీ - ఇంకో గ‌దిలో ఈడీ అధికారులు కూర్చుని రేవంత్‌ ను విచారించారు. ఈ విచార‌ణ‌లో ఏసీబీ - ఐటీ అధికారులు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు రేవంత్ ఇచ్చిన స‌మాధానాల‌ను ఈడీ త‌న చేతిలోకి తీసుకుంది. ఆ త‌ర్వాత అవే ప్ర‌శ్న‌ల‌ను రేవంత్‌ కు సంధించిన ఈడీ... మూడు ద‌ర్యాప్తు సంస్థ‌ల విచార‌ణ‌లో రేవంత్ ఎలాంటి స‌మాధానాలు చెప్పార‌న్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గానే నోట్ చేసుకుంద‌ట‌. ఈ త‌ర‌హా విచార‌ణ 8 గంట‌ల పాటు నాన్ స్టాప్‌ గానే కొన‌సాగినా... మ‌ధ్యాహ్నం మాత్రం ఓ అరగంట పాటు రేవంత్‌ కు విశ్రాంతి ఇచ్చార‌ట‌.

ఒకే త‌ర‌హా ప్ర‌శ్న‌లు మూడు ద‌ర్యాప్తు సంస్థ‌ల నుంచి బాణాల్లా దూసుకురావ‌డంతో రేవంత్ కిందా మీదా ప‌డ్డార‌ట‌. స్టీఫెన్ స‌న్‌ కు ఇచ్చిన రూ.50 ల‌క్ష‌లు ఎక్క‌డివి? ఎవ‌రు ఇచ్చారు? ఏ మార్గాన తీసుకొచ్చారు? స్టీఫెన్‌ స‌న్‌ కు త‌ర్వాత ఇస్తామ‌ని హామీ ఇచ్చిన రూ.4.5 కోట్లు ఎక్క‌డి నుంచి సేక‌రించాల‌నుకున్నారు? అప్ప‌టికే సేక‌రించి పెట్టారా? ఈ మొత్తం రూ.5 కోట్లు ఎవ‌రు ఇచ్చారు?త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌కు రేవంత్ స‌మాధానాలు చెప్పాల్సి వ‌చ్చింద‌ట‌. మొత్తంగా మూడు ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారుల నాన్ స్టాప్‌ గ్రిల్లింగ్ తో.. రేవంత్ గుల్లే అయిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. విచార‌ణ ముగిసిన త‌ర్వాత సినిమా ఇక్క‌డితోనే అయిపోలేద‌ని, రేపు కూడా విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని ఈడీ అధికారులు రేవంత్‌ కు చెప్పి పంపార‌ట‌. ఈ విష‌యాన్ని విచార‌ణ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా రేవంతే స్వ‌యంగా చెప్పారు. అధికారులు అడిగిన ప్ర‌శ్న‌లన్నింటికీ స‌మాధానాలు ఇచ్చాన‌ని చెప్పిన రేవంత్‌... త‌న విచార‌ణ‌కు కేంద్రం - రాష్ట్ర ప్ర‌భుత్వాలే కార‌ణ‌మని ఆరోపించారు. త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని - అందులో భాగంగానే ఈ విచార‌ణ‌కు తెర లేసింద‌ని కూడా రేవంత్ త‌న పాత డైలాగుల‌ను వ‌ల్లె వేయ‌డం గ‌మ‌నార్హం.