Begin typing your search above and press return to search.

ఫుల్ క్లారిటీ: బ‌్యాలెట్ వ‌ద్దు.. ఈవీఎంలే ముద్దు

By:  Tupaki Desk   |   24 Jan 2019 8:25 AM GMT
ఫుల్ క్లారిటీ: బ‌్యాలెట్ వ‌ద్దు.. ఈవీఎంలే ముద్దు
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి దాదాపుగా దేశానికి ప‌ట్టేసింది. మ‌హా అయితే.. మ‌రో నెలలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిషికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌న్న వేళ‌.. ఇప్పుడంతా రాజ‌కీయాల‌పై జోరుగా చ‌ర్చ‌లుసాగుతున్నాయి. ఇక‌.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న వార్ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. ఈవీఎంల‌పై కొత్త కొత్త అనుమానాల‌కు తెర తీస్తూ.. కొత్త ఆరోప‌ణ‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి.

మూడు రోజుల క్రితం ఈవీఎంల‌ను హ్యాక్ చేసి.. బీజేపీ విజ‌యం సాధించిందంటూ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌టం తెలిసిందే. లండ‌న్ లో పెట్టిన ప్రెస్ మీట్ పై ఇండియాలో ఎంత సంచ‌ల‌నంగా మారిందో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈవీఎంల‌పై ఇటీవ‌ల కాలంలో ప‌లు పార్టీలు సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఇలాంటి వేళ‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ విధానానికి ఈసీ మొగ్గు చూపుతుంద‌న్న అనుమానం తలెత్తింది.

అయితే.. సందేహాల‌కు తావివ్వ‌ని రీతిలో ఈ రోజు (గురువారం) కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరుపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ్యాలెట్ విధానానికి తాము వెళ్ల‌మ‌ని.. బ్యాలెట్ ప‌ద్ద‌తిలో కౌంటింగ్ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని.. అది సాధ్యం కాద‌ని పేర్కొంది. సార్వ‌త్రికానికి ఈవీఎంల‌ను వినియోగించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించింది. ఒక‌వేళ ఈవీఎంల‌పై ఏదైనా అనుమానాలు ఉంటే ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకొస్తే తాము ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పింది. ఈసీ తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈవీఎంల‌ తోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తార‌న్న అంశంపై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.