Begin typing your search above and press return to search.

ర‌వితేజ గురించి జీష‌న్ అలీ ఆ మాట చెప్పాడా?

By:  Tupaki Desk   |   23 July 2017 5:57 AM GMT
ర‌వితేజ గురించి జీష‌న్ అలీ ఆ మాట చెప్పాడా?
X
డ్ర‌గ్స్ కేసు సృష్టిస్తున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ కేసుకు సంబంధించిన ప‌లు షాకింగ్ విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కేసులో కీల‌క నిందితుడైన కెల్విన్ నోటి నుంచి వ‌చ్చిన నిజాల‌తో టాలీవుడ్ షేక్ అయితే.. అంత‌కు మించి అన్న రీతిలో తాజాగా విచారిస్తున్న జీష‌న్ అలీ నోటి నుంచి వ‌స్తున్న వివ‌రాలు మ‌రింత సంచ‌ల‌నంగా మారిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌న‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్న సిట్ అధికారుల‌కు జీష‌న్ అలీ ప‌లు షాకింగ్ విష‌యాలు చెప్పిన‌ట్లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నోటీసులు అందుకున్న వారే కాకుండా.. మ‌రికొంద‌రు టాలీవుడ్ యువ హీరోల‌కూ డ్ర‌గ్స్‌తో సంబంధాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

కొన్ని మీడియా సంస్థ‌లు అందిస్తున్న వార్త‌ల ప్ర‌కారం.. విచార‌ణ‌లో జీష‌న్ అలీ.. సినీ ప్ర‌ముఖుల‌తో త‌న‌కున్న సంబంధాల గురించి వెల్ల‌డించిన‌ట్లుగా చెబుతున్నారు. హీరో ర‌వితేజ‌.. ఒక‌ప్ప‌టి హీరో న‌వ‌దీప్‌కు జీష‌న్ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లుగా సిట్ ఎదుట చెప్పిన‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించిన ఆధారాల్ని సిట్ సేక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. జీష‌న్ అలీ సౌత్ ఫ్రికా నుంచి డ్ర‌గ్స్ తెచ్చి ర‌వితేజ‌కు ఇచ్చేవాడ‌ని.. వాటిని ఆయ‌న స‌ర‌ఫ‌రా చేసేవాడ‌న్న వార్త ఒక‌టి ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ర‌వితేజ‌తో పాటు.. న‌వ‌దీప్‌కు కూడా జీష‌న్ అలీ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే వాడ‌ని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని సిట్ కొంత‌మేర సేక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. డ్ర‌గ్స్ రాకెట్ లో కెల్విన్ త‌ర్వాత కీలక పాత్ర జీష‌న్ అలీదేన‌ని చెబుతున్నారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ నెల 25న ర‌వితేజ‌ను సిట్ అధికారులు విచారించ‌నున్నారు. ఆయ‌న్ను విచారించిన త‌ర్వాత డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారుల దృష్టికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.