Begin typing your search above and press return to search.

నిజంగానే డ్రాగన్ కనిపించిందట!

By:  Tupaki Desk   |   24 Oct 2016 6:57 AM GMT
నిజంగానే డ్రాగన్ కనిపించిందట!
X
ప్రపంచవ్యాప్తంగా చైనాను డ్రాగన్ దేశంగా పిస్తుంటారనే విషయం తెలిసిందే. ఎందుకంటే... చైనీయుల పురాణాల్లో డ్రాగన్ల గురించిన ప్రస్థావన ఉంటుంది. అలాగే డ్రాగన్లు అత్యంత శక్తివంతమైన జీవులని, పవిత్ర శక్తులు కలిగివుండే డ్రాగన్లు నీరు, వర్షపాతం, ప్రకృతి విపత్తులపై అధికారం కలిగివుంటాయని చైనీయుల గట్టి నమ్మకం. దీంతో చైనాను పాలించిన రాజులు డ్రాగన్ ను వాళ్ల శక్తి, సామర్ధ్యాలకు గుర్తుగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ డ్రాగన్లను ఇప్పటివరకూ ఎవరైనా చూశారా అంటే మాత్రం అలాంటిదేమీ లేదనే సమాధానమే వస్తుంది. కానీ తాజాగా చైనాలో డ్రాగన్ ఎగురుతూ వెళ్లింది అనే ఒక వీడియో హల్ చల్ చేస్తోంది.

చైనా బోర్డర్ లో నిజంగా డ్రాగన్ కనిపించిందంటూ ఒక వీడియో ఆన్ లైన్ లో పోస్ట్ అయ్యింది.. చైనా-లావోస్ బోర్డర్లో ఓ వ్యక్తి ఒక ఆకారం ఓ పర్వతం వైపు ఎగురుతూ వెళ్తుండగా సెల్ ఫోన్ లో బంధించాడు. అది కచ్చితంగా డ్రాగనే అని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్లు నిజంగానే ఉన్నాయని కొందరంటుంటే... ఇది టెక్నాలజీ మాయ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వీరిలో ఒక వ్యక్తి మాత్రం తాను చదివిన పుస్తకాల్లో శాస్త్రజ్ఞులు అచ్చం సహజ పక్షుల్లాగా ఎగిరే డ్రోన్లను తయారుచేస్తున్నారని ఇది అందులో ఒకటి కావొచ్చని అభిప్రాయ పడ్డాడు.

ఇదే క్రమంలో చైనా సంప్రదాయ భాషపై పట్టుకలిగిన వారిని సమకాలీన చైనీయులు డ్రాగన్ తోనే పోల్చుతారు. చైనాలో చేప, ఊహా జనిత చిత్రాలు, కప్పల ఆకారంలో డ్రాగన్ల చిత్రాలు అక్కడి పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంటాయి. వీటిలో నాలుగు కాళ్లు, రెండు భారీ రెక్కలు కలిగిన జంతువు డ్రాగన్ ఆకారంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే విదంగా డ్రాగన్లపై ప్రపంచవ్యాప్తంగా కామిక్ పుస్తకాలు, టీవీ షోలు, సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎగురుతున్నట్లు కనిపించింది డ్రాగనా కాదా అనే విషయాలు మాత్రం పూర్తిగా నిర్ధారణ కాలేదు!