Begin typing your search above and press return to search.

ఆ ఊళ్లో అబ్బాయిలకి ముగ్గురు గర్లఫ్రెండ్స్

By:  Tupaki Desk   |   5 Sep 2015 5:02 AM GMT
ఆ ఊళ్లో అబ్బాయిలకి ముగ్గురు గర్లఫ్రెండ్స్
X
చైనాలోని ఒక సిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఊరు గురించి ఇప్పడందరు మాట్లాడుకోవటం మొదలైంది. ఎందుకంటే.. ఆ ఊళ్లో ప్రతి అబ్బాయికి ఇద్దరు లేదంటే ముగ్గురు గర్లఫ్రెండ్స్ చాలా సహజం. అయితే.. ఇవన్నీ చాటుమాటుగా.. గుట్టుగా సాగిపోతాయా? అంటే.. లేదు.. అంతా ఓపెన్ గానే నడిచిపోతుంటుంది.

ప్రతి అబ్బాయికి ఇద్దరు.. లేదంటే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ చాలా మామూలు విషయం. మనకు తెలిసినంతవరకూ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి జేబులో పైసలు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ.. ఈ ఊళ్లో మాత్రం కాస్త భిన్నం. అబ్బాయిల కోసం అమ్మాయిలే వీలైనంతగా ఖర్చుపెట్టేస్తుంటారు. అంతేకాదు.. తాము కానీ బాగా ఖర్చు పెట్టేస్తే.. వాళ్ల మనసుల్ని దోచుకోవచ్చని ఫీలవుతుంటారట. ఇలాంటి చిత్రమైన పరిస్థితి చైనాలోని డాంగ్వాన్ నగరంలో నెలకొంది.

మరింత ఫాస్ట్ గా ఉన్నారంటే.. అక్కడున్న వారంతా ఆగర్భ శ్రీమంతులని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఇలాంటి కల్చర్ సాదాసీదాగా ఉండేవారిలో కూడా కామన్.

ఒక బాయ్ ఫ్రెండ్ కి ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్ ఉండటం.. వారంతా కలిసి తిరగటమే కాదు.. ఒక్కోసారి కలిసి పడకను కూడా పంచుకుంటారట. మరీ.. ఒకేసారి కాకున్నా.. కాస్త అటుఇటుగా.. అంటే.. యవ్వారం మిగిలిన వారికి తెలిసే మరి. అలాంటప్పుడు అసూయ.. ద్వేషం.. పగ..ప్రతీకారం వగైరాలేమీ పెద్దగా ఉండవట. ఎందుకంటే అన్నీ ఓపెన్ గానే సాగిపోతుంటాయి.

ఇంత చిత్రమైన వ్యవహారం ఎలా? అన్నది బేసిక్ క్వశ్చన్. దీనికి అక్కడ నిర్వహించిన ఒక సర్వే చెబుతున్నదేమంటే.. ప్రతి వంద మంది అమ్మాయిలకు ఉన్న అబ్బాయిల సంఖ్య 89 మాత్రమేనట. దీంతో.. కాంపిటీషన్ పెరిగిపోయి.. మనసుకు నచ్చిన మగాడి కోసం అమ్మాయిలు విపరీతంగా ట్రై చేస్తూ.. వారి మనసుల్ని గెలుచుకోవటానికి తీవ్రంగా శ్రమిస్తుంటారట.

ఈ అమ్మాయిల్లో జాబ్ లు చేసే వారే అధికమని.. వారికి సగటున నెలకు రూ.20వేల వరకు సంపాదిస్తారని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో బాయ్ ఫ్రెండ్ జేబులో డబ్బులు లేకపోవటాన్ని గుర్తించి.. తమ దగ్గరున్న మొత్తాన్ని కొంత వారి పర్సుల్లో పెట్టేసి.. ఖర్చులకు వాడుకో అని చెప్పేస్తుంటారట. అంతేకాదు.. ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే.. అంతగా తమ బాయ్ ఫ్రెండ్ మనసులో రిజిష్టర్ అవుతారని ఫీలై.. అలానే ఖర్చు చేసేస్తుంటారట. బాయ్ ఫ్రెండ్ తో తిరగటం ఓకే.. మరి పెళ్లిళ్ల మాటేమిటంటే మాత్రం.. అప్పటివరకూ తమ మనసుకు నచ్చిన వారితో సరదాగా ఉండేసిన వారు.. యావరేజ్ గా 27 వయసులో తమకు నచ్చిన వారితో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారట.

చైనాలాంటి దేశంలో ఇలాంటి కల్చరా? అని చాలామంది షాక్ తింటున్న పరిస్థితి. ఈ నగరంలో కల్చర్ తో ఇప్పుడీ సిటీకి ‘‘సెక్స్ కాపిటల్ సిటీ ఆఫ్ చైనా’’ అన్న పేరును సొంతం చేసుకుంది. దీంతో.. అక్కడి ప్రభుత్వం ఈ ట్రెండ్ మీద దృష్టి సారించిందట. ప్రస్తుతం సదరు సిటీలో నడుస్తున్న ట్రెండ్ గురించి వీలైనంత తక్కువ చేసి చూపించేందుకు తెగ ట్రై చేస్తుందట.