Begin typing your search above and press return to search.

ట్రంప్ బాధః దాడిలో అంద‌మైన వాళ్లు చ‌నిపోయారు

By:  Tupaki Desk   |   23 May 2017 2:17 PM GMT
ట్రంప్ బాధః దాడిలో అంద‌మైన వాళ్లు చ‌నిపోయారు
X
మాంచెస్ట‌ర్ క‌న్స‌ర్ట్‌ లో జ‌రిగిన ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌రంగా, ఆశ్చ‌ర్య‌క‌రంగా స్పందించారు. ఈ దాడిని ఖండించిన ట్రంప్ ఇందులో అనేక మంది అంద‌మైన యువ అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయార‌ని వ్యాఖ్యానించారు. దుష్ట‌ ప‌రాజితులు వ‌ల్ల అమాయ‌క జ‌నం హ‌త్య‌కు గురైన‌ట్లు ఆయ‌న కామెంట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన వాళ్ల‌ను రాక్ష‌సులు అని అన‌లేమ‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే వాళ్లు దాన్ని ఇష్ట‌ప‌డుతార‌ని, అదో గొప్ప పేరుగా వాళ్లు భావిస్తార‌న్నారు. దాడికి పాల్ప‌డిన‌వాళ్ల‌ను తాను ప‌రాజితులుగా చిత్రీక‌రిస్తున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి ర‌క్త‌పాతాన్ని మ‌న స‌మాజం స‌హించ‌బోద‌న్నారు. వికృత ఐడియాల‌జీని నిర్మూలించాల‌ని ట్రంప్ ఆకాంక్షించారు. కాగా, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కూడా మాంచెస్ట‌ర్ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం ప్ర‌క‌టించారు. దాడి ఓ అనాగ‌రిక చర్య అన్నారు. ఆత్మాహుతి దాడి వెనుక ఉన్న వాళ్లు శిక్ష నుంచి త‌ప్పించుకోలేర‌న్నారు. ఉగ్ర‌వాదంపై పోరులో బ్రిట‌న్‌తో ప‌నిచేసేందుకు పుతిన్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.