Begin typing your search above and press return to search.

ట్రంప్ ను ఇడియట్ చేసిన గూగుల్..?

By:  Tupaki Desk   |   20 July 2018 11:49 AM GMT
ట్రంప్ ను ఇడియట్ చేసిన గూగుల్..?
X
గూగుల్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమాచారానికి దిక్సూచీ.. ఏదీ కావాలన్నా అందులో వెతకాల్సిందే.. గూగుల్ లేని ఇంటర్నెట్ ను ఊహించలేం. గూగులే అంతా.. మొబైల్ లోనైనా.. కంప్యూటర్ లోనైనా.. ఏ విషయంనైనా అందులోనే వెతుకుతాం.. ఖచ్చితమైన సమాచారానికి కేరాఫ్ అడ్రస్ అయిన గూగుల్ కూడా అప్పుడప్పుడూ తప్పు చేస్తుంది. ఆ తప్పు బయటపడి వైరల్ అయ్యాక సరిదిద్దుకుంటుంది. ఈసారి కూడా గూగుల్ పొరపాటుకు బలైపోయాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఇడియట్ అనే ఇంగ్లీష్ పదాన్ని కొడితే డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు వస్తున్నాయి. కొందరు ఆన్ లైన్ యాక్టివిస్టులు గూగుల్ ఆల్గారిథమ్స్ ను ప్రభావితం చేసి ఇలా చేశారని టెక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇడియట్ అనే పదాన్ని ట్రంప్ ఫొటోతో అనుసంధానించి గూగుల్ అల్గారిథమ్ మార్చినట్టు సీనెట్ అనే సంస్థ తాజాగా వెల్లడించింది. ట్రంప్ ప్రవేశ పెడుతున్న విధానాలకు చిర్రెత్తిన కొందరు అమెరికన్లే ఇలా చేసి ఉంటారని ఓ రిపోర్ట్ బయటపెట్టింది.

గూగుల్ లో ఏదైనా పదం మనం టైప్ చేయగానే దానికి సంబంధించిన లింక్ లు వస్తుంటాయి. ఇందులో అల్గారిథమ్ కీలకపాత్ర పోషిస్తుంది. అదే సమయంలో కొందరు టెక్ నిపుణులు అల్గారిథమ్ లో మార్పులు చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. ఇది ఇప్పుడే కాదు.. గతంలోనూ జరిగింది. గూగుల్ సెర్చ్ లో పప్పు అని టైప్ చేస్తే రాహుల్ గాంధీ బొమ్మ అప్పట్లో కనిపించేది. ఇది దుమారం రేగడంతో గూగుల్ సరిచేసింది. ఇప్పుడీ ‘ఇడియట్ ’ను కూడా సరిచేస్తుందని భావిస్తున్నారు.