Begin typing your search above and press return to search.

ట్రంప్ నన్ను లైంగికంగా వేధించాడు

By:  Tupaki Desk   |   24 July 2016 4:25 AM GMT
ట్రంప్ నన్ను లైంగికంగా వేధించాడు
X
వివాదాల‌కు పెట్టింది పేర‌యిన అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ ద‌ఫా షాకింగ్ వార్త ద్వారా తెర‌మీద‌కు వ‌చ్చాడు. ట్రంప్‌ పై లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా కేసు కూడా వేసి పోరాటం చేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ జిల్ హార్త్ త‌న ఆవేద‌న‌కు త‌గిన సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌పంచానికి తెలియజెప్పింది. ఈ క్ర‌మంలో త‌న ప‌రువు పోతున్నప్ప‌టికీ మీడియా ముందుకు వ‌చ్చిన‌ట్లు వాపోయింది.

త‌ను, త‌న కాబోయే భ‌ర్త చేపట్టిన ప్రాజెక్టుకు ట్రంప్ స్పాన్సర్ అవడం వల్ల ఆయన వద్దకు పలుసార్లు వెళ్లిన‌పుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని జిల్ తెలిపింది. అపుడే కేసు వేసి త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల్లో ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల ట్రంప్ కామెంట్లతో 20 ఏళ్ల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చాన‌ని చెప్పింది. న్యూయార్క్‌ లోని గార్డియన్ మీడియా ఇంటర్వ్యూలో ఆమె అనేక విష‌యాలు వెల్లడించారు. వ్యాపారంలో భాగంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో హోట‌ల్ల‌లో బ‌ల్ల కింద నుంచి తన శ‌రీరాన్ని తడిమాడ‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న నివాసంలో చిన్న పిల్ల‌ల గ‌దిలో అత్యాచారం చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించాడ‌ని వాపోయింది. ప‌క్క గ‌దిలో త‌న కాబోయే భ‌ర్త‌ - ఇత‌రులు ఉండ‌టంతో ఒకింత ధైర్యం చేసి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది. చివరకు వేధింపులు భరించలేక న్యాయవాదిని సంప్రదించి అత్యాచారయత్నం కింద కేసు పెట్టాన‌ని జిల్ వివరించారు. అయితే ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ‌తో త‌నపై న‌మోదైన రేప్ కేసులో త‌ప్పేంలేద‌ని ట్రంప్ చెప్పుకోవ‌డం షాక్ క‌లిగించింద‌ని వ్యాఖ్యానించింది. పైగా ఆయ‌న కూతురు కూడా మ‌ద్ద‌తివ్వ‌డం దిమ్మ తిరిగిపోయినంత ప‌న‌యింద‌ని జిల్ చెప్పుకొచ్చింది.

త‌న‌పై జ‌రిగిన అత్యాచారం గురించి సుదీర్ఘ కాలం త‌ర్వాత వార్త‌లు రావ‌డం, అందులో తప్పంతా త‌న‌దే అని తండ్రి - కూతుళ్లు చెప్ప‌డంతో మీడియా ముందుకు వ‌చ్చాన‌ని జిల్ హార్త్‌ తెలిపింది. ప‌ద‌వి కోసం ట్రంప్ అబద్దం చెప్ప‌డం కంటే త‌న‌పై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన‌పుడు కేవ‌లం ప‌దేళ్ల వ‌య‌స్సున్న ఆయ‌న కూతురు ఈ విధంగా మాట్లాడ‌టం షాకింగ్‌గా ఉంద‌ని జిల్ వాపోయింది. త‌న ప‌రువు, వ్య‌క్తిగ‌త జీవితం న‌ష్ట‌పోయింద‌ని ఆమె పేర్కొంటూ ట్రంప్ నుంచి తానేమీ ఆశించ‌టం లేద‌ని తెలిపింది. చేసిన ప‌ని గురించి త‌ప్పు ఒప్పుకొని క్ష‌మాప‌ణ‌లు కోరితే చాల‌ని తెలిపింది.