Begin typing your search above and press return to search.

నేను గెలిస్తేనే రిజల్ట్స్ ని ఒప్పుకుంటా-ట్రంప్

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:49 AM GMT
నేను గెలిస్తేనే రిజల్ట్స్ ని ఒప్పుకుంటా-ట్రంప్
X
సాదారణంగా ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు ఫలితాల అనంతరం... గెలిచిన పార్టీలు - ప్రజలకు కృతజ్ఞతలు - ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయం వంటి మాటలు మాట్లాడతారు. ఇక పరాజయం పాలై ప్రతిపక్షంలో కూర్చునే పార్టీలు - ప్రజలు మాకిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను స్వీకరిస్తున్నాం, ఈ ఎన్నికల ప్రజల తీర్పును ఆహ్వానిస్తున్నాం వంటి స్టేట్ మెంట్శ్ ఇస్తుంటారు. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ ఆలోచన - అభిప్రాయం మాత్రం పూర్తిగా భిన్నం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు వాడి వేడి గా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఫలితాలపై మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఈ ఎన్నికలకు సంబందించి రాబోయే ఫలితాలపై స్పందించిన ట్రంప్... "అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో నేను గెలిస్తేనే ఫలితాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తాను - ఎన్నికల ఫలితం ప్రశ్నార్థకమైనప్పుడు దానిని సవాల్ చేసే హక్కు నాకు ఉంది - అక్రమ వలసదారులు డ్రైవింగ్ లెసైన్స్ కలిగివుంటే ఎన్నికల్లో ఓటు వేయొచ్చని హిల్లరీ శిబిరం పేర్కొన్నట్లు వికీలీక్స్ చెప్తోంది" అని అన్నారు. దీంతో... తాను గెలిస్తేనే ఎన్నికలు సక్రమంగా జరిగాయని, తాను ఓడిపోతే ఆ ఎన్నికలు సరిగా జరిగినట్లు కాదని, వాటిని సవాల్ చేస్తానని చెప్పడం ట్రంప్ కే చెల్లిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక, ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడిన ఏ వ్యక్తిపైనా రానన్ని లైంగిక వేదింపులకు సంబందించిన ఆరోపణలు డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటివరకూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ... వాటి పరంపర అలానే కొనసాగుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో యోగా శిక్షకురాలు ఒకరు చేరారు. తాజాగా ట్రంప్ పై స్పందించిన యోగా శిక్షకురాలు కరెనా వర్జినియా... 18 ఏళ్ల క్రితం ట్రంప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, 1998లో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ స్టేడియం వెలుపల తనను గట్టిగా లాగి ఛాతిపై చేయి వేశాడని ఆరోపించారు. దీంతో మద్దతు సంగతి కాసేపు పక్కనపెడితే ట్రంప్ పై లైంగిక వేదింపుల లిస్ట్ రాను రానూ పెరిగిపోతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి... ట్రంప్ లైంగిక వేదింపులకు బలైన వారంతా ఓటువేసినా హిల్లరీకి అత్యధిక మెజారిటీ వస్తుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/