Begin typing your search above and press return to search.

ట్రంప్ కు ఆ ప్ర‌శ్న‌లు వేసిన తొమ్మిదేళ్ల కుర్రాడు

By:  Tupaki Desk   |   28 July 2017 7:42 AM GMT
ట్రంప్ కు ఆ ప్ర‌శ్న‌లు వేసిన తొమ్మిదేళ్ల కుర్రాడు
X
తొమ్మిదంటే తొమ్మిదేళ్ల చిన్నారి ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయ్యాడు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ను ఆ పిల్లాడు వేసిన ప్ర‌శ్న‌లు వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ తొమ్మిదేళ్ల పిల్లాడు అంత పెద్ద ట్రంప్ ను ఎలా ప్ర‌శ్న‌లు వేశారు? ఇంత‌కీ ఆ ప్ర‌శ్న‌ల్లో ఏముంది? అమెరికాలో ఇప్పుడా ప్ర‌శ్న‌లు వైర‌ల్ కావ‌ట‌మే కాదు. ప్ర‌పంచాన్ని అంత‌లా ఎందుకు ఆక‌ర్షిస్తున్నాయన్న‌ది చూస్తే..

దేశాధ్య‌క్షుడికి దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండే చిన్నారులు రాసిన లేఖ‌ల్ని ఒక వేదిక పై నుంచి చ‌దివే సంప్ర‌దాయానికి ఆయ‌న తెర తీశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ట్రంప్‌ న‌కు ప‌లువురు పిల్ల‌లు రాసిన లేఖ‌ల్ని చ‌దివి వినిపించారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే తొమ్మిదేళ్ల పికెల్ అనే కుర్రాడు రాసిన లేఖ అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఈ పికెల్ ఎవరంటారా? పికెల్ అస‌లు పేరు డిలాన్‌. కానీ.. అత‌డ్ని అంద‌రూ పికెల్ అని పిలుస్తుంటార‌ట‌.

ట్రంప్‌న‌కు రాసిన లేఖ‌లో ఆ పిల్లాడు రాసిందేమంటే.. "నా వ‌య‌సు తొమ్మిదేళ్లు. నాకు ఇష్ట‌మైన అధ్య‌క్షులు మీరు. మీ టోపీ లాంటి కేసును నా బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌ట్ చేశా. ఇంత‌కీ మీ వ‌య‌సు ఎంత‌? వైట్ హౌస్ ఎంత పెద్ద‌దిగా ఉంటుంది? మీకు ఎంత డ‌బ్బు ఉంది? ప్ర‌జ‌ల్ని మిమ్మ‌ల్ని ఎందుకు ఇష్ట‌ప‌డ‌తారో తెలీదు. కానీ.. మీరు నాతో స్నేహం చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారా? మీకు నా ఫోటో పంపుతున్నా. మీరు దాన్ని చూసి ఉంటే హాయ్ అని చెప్పండి" అంటూ ఆ పిల్లాడు రాశాడు. బుజ్జి బుజ్జి ప‌దాల‌తో ముద్దుముద్దుగా రాసిన ఆ పిల్లాడి ఉత్త‌రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.