Begin typing your search above and press return to search.

ట్రంప్‌...ఇలాంటిది ఊహించ‌లేదేమో

By:  Tupaki Desk   |   27 April 2017 3:59 PM GMT
ట్రంప్‌...ఇలాంటిది ఊహించ‌లేదేమో
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఊహించ‌ని నిర‌స‌న ఎదురైంది. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా వంద మంది మహిళలు స్ట్యాచూ ఆఫ్ లిబర్టీ వేషధారణలో ఇవాళ లండన్‌ లో నిరసన తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణకు పనిచేసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎన్‌ జీవో సంస్థకు చెందిన 100 మంది మహిళా కార్యకర్తలు లండన్‌ లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిషేదం వద్దు.. గోడ కట్టవద్దు, శరణార్థులకు స్వాగతం అంటూ పలు ప్లకార్డులను ప్రదర్శించారు.

ఇదిలాఉండ‌గా..అక్టోబర్ నెల రెండో వారంలో బ్రిటన్‌ లో పర్యటించనున్నారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న ఇప్ప‌టికే పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ట్రంప్‌ ఒకింత భిన్నమైన కోరికను బయటపెట్టారు. అదేంటంటే...బ్రిట‌న్ రాణి ఎలిజబెత్‌ తో మర్యాదపూర్వక భేటీ కోసం బకింగ్‌ హామ్ ప్యాలెస్ వరకు తన బుల్లెట్ ప్రూఫ్ కారును పక్కన పెట్టి బంగారం మెరుగులు అద్దిన రాణిగారి రథంలో ప్రయాణం చేస్తానని చెప్ప‌డం. త‌న ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బ్రిట‌న్ రాణి ర‌థం సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని బ్రిటన్ భద్రతా సిబ్బందికి ట్రంప్‌ సూచించారు. అధ్య‌క్షుడి కోరిక‌కు మ‌ద్ద‌తుగా వైట్‌హౌస్ సిబ్బంది కూడా ఒత్తిడి తెస్తున్నట్టు ‘ది సండే టైమ్స్’ పేర్కొంది. అయితే... ట్రంప్ బ్రిటన్ వస్తే పది వేల మందికిపైగా జనం ఆందోళన చేపట్టే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించలేమని అధికారులు తెలిపారు. ఆ రథం కంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళితేనే మంచిదని బ్రిటన్ అధికారులు బదులిచ్చారు. భారీ రాకెట్లు, పేలుడు పదార్థాలను తట్టుకునే సామార్థం రథానికి లేదని వివరించారట. రథానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఏర్పాటుచేయచ్చు కానీ అవి ఎక్కడైనా పడిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/