Begin typing your search above and press return to search.

ట్రంప్ ప‌డి చ‌చ్చేలా చేసిన రాజ‌కుమార్తె ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   26 Sep 2017 11:54 AM GMT
ట్రంప్ ప‌డి చ‌చ్చేలా చేసిన రాజ‌కుమార్తె ఎవ‌రంటే?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఉన్న అమ్మాయిల షోకు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. మళ్లీ పక్క చూపులు మాత్రం కామనే. అన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ప్లేబాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ కు ఉన్న షోకుల రాయుడి వేషంలోని ఓ ఉదంతం మ‌రోమారు బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2000వ సంవత్సరంలో రేడియో హోస్ట్ హోవార్డ్ స్టెర్న్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు ఆడియో ఇప్పుడు బయటపడింది.

అందులో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా అంటే తనకు ఎంత పిచ్చి ఉండేదో ట్రంప్ చెప్పారు. డయానా క్రేజీ అయినా ఆమెతో పడుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడినని ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. డయానా చాలా అందంగా ఉండేదని, ఆమె సూపర్ బ్యూటిఫుల్ అని కొనియాడారు. ఈ ఇంటర్వ్యూ కంటే మూడేళ్ల ముందే అంటే 1997లోనే ఓ కారు ప్రమాదంలో డయానా చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె మంచి పొడగరి.. అందగత్తె.. మంచి రంగు అన్నీ ఉన్నాయి. ఆమె ఓ అద్భుతం.అని ట్రంప్ డయానాపై పొగడ్తలు కురిపించారు. ఇదే ఇంటర్వ్యూలో ట్రంప్ తన టాప్ టెన్ హాటెస్ట్ వుమెన్ లిస్ట్ కూడా చెప్పారు. అందులో డయానాకు మూడో ర్యాంక్ ఇచ్చారు. ఆ జాబితాలో మాజీ భార్య ఇవన్నా రెండో స్థానంలో - ప్రస్తుత భార్య మెలానియా తొలి స్థానంలో ఉండటం విశేషం.

1990ల్లో స్టెర్న్ రేడియో షోలకు ట్రంప్ రెగ్యులర్‌ గా వచ్చేవారు. ఈ ఇంటర్వ్యూల్లో డయానా అంటే తాను ఎంతలా పడి చచ్చేవాన్నో కూడా ట్రంప్ చెప్పారు. ఆమెను తన కలల రాణిగా చెప్పుకొన్నారు. వీళ్లిద్దరూ చాలాసార్లే కలిశారు. కలిసినప్పుడల్లా వందల పౌండ్ల విలువైన బొకేలు డయానాకు ట్రంప్ ఇచ్చేవారు. తనపై ట్రంప్‌ కున్న అభిమానం చూసి ఒక దశలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో డయానా ఉండిపోయారట. ఆమె యాక్సిడెంట్‌ లో చనిపోయిన తర్వాత.. డయానాతో డేటింగ్ చేయకపోవడమే తన జీవితంలో పెద్ద లోటు అని ట్రంప్ తన స్నేహితులతో చెప్పారట.