Begin typing your search above and press return to search.

ట్రంప్ తగ్గడంలేదు.. సెక్స్ టేపులంట!

By:  Tupaki Desk   |   1 Oct 2016 7:21 AM GMT
ట్రంప్ తగ్గడంలేదు.. సెక్స్ టేపులంట!
X

మొదటి డిబేట్ అనంతరం ట్రంప్ విజయావకాశాలు మరింత తగ్గాయని, ఆయనకు - హిల్లరీకి మధ్య తేడీ మరింత పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్న తరుణంలో కొత్త సలహాదారులను నియమించుకున్నారు ట్రంప్. బహిరంగ సభల్లో కేవలం వాళ్లు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడాలనుకున్న ట్రంప్... పాత అలవాటును మానుకోలేకపోతున్నారు. మాజీ మిస్ యూనివర్స్‌ ఎలీషియా మచాడో విషయంలో ట్రంప్ ను ఏకిపారేసిన హిల్లరీ పైనా, మచాడొ పైనా మరోసారి తనదైన శైలిలో స్పందించారు ట్రంప్. అయ్యిందేదో అయ్యిందని ఆ విషయాన్ని అక్కడితో ఆపకుండా మరోసారి తేనెతుట్టును కదిలించారు!

ఈ విషయాలపై స్పందించిన ట్రంప్... తాను మచాడోని తిట్టానని అంతా అంటున్నారు కానీ, ఆమె ఒక సెక్స్‌ టేప్‌ లో ఉన్న విషయాన్ని విమర్శకులతో పాటు హిల్లరీ కూడా చూసుకోవాలని చెప్పారు. ఈ మేరకు తెల్లవారుజామున హిల్లరీ క్లింటన్‌ ను విమర్శిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. 1996లో వెనిజులా సుందరి ఎలీషియా మచాడో మిస్‌ యూనివర్స్ గా గెలుపొందడం, అనంతరం ఆమె కొంతకాలానికి బరువు పెరగడం.. దీంతో ఆమెను వెంటాడి మరీ దారుణమైన వ్యాఖ్యలు చేసిన ట్రంప్... ఆమెను మిస్‌ పిగ్గీ, తిండిబోతు అంటూ నానా దుర్భాషలు ఆడిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబందించిన వీడియోను సైతం మొదటి డిబేట్ లో చూపించిన హిల్లరీ, ట్రంప్ కు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని ఫుల్ గా వాయించేశారు.

ఆ విషయాన్ని తాజాగా ప్రస్థావించిన ట్రంప్... ఎలీషియా మచోడి ఆమె ఓ సెక్స్ టేపుల విషయాన్ని గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఆ మిస్ యూనివర్స్ గతాన్ని తెలుసుకోకుండా ఆమెను ఒక దేవతలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు 'క్రూకెడ్ హిల్లరీ' అని మరో ట్వీట్‌ చేశారు. కాగా 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌ లో ప్రస్తావించడం, మహిళలపై ట్రంప్ కు ఉన్న గౌరవానికి ఇది ప్రతీక అని చెప్పడం తెలిసిందే! ఇదే విషయాలపై స్పందించిన మచోడి... ట్రంప్ తనను ఒక చెత్త కుప్పులాగా చూసేవాడని, 20ఏళ్ల తర్వాత మళ్లీ పీడకలలా తన గురించి ట్రంప్ మాట్లాడారాని మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/