Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టులు..నిజాయితీ లేని వ్య‌క్తులు!

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:55 AM GMT
జ‌ర్న‌లిస్టులు..నిజాయితీ లేని వ్య‌క్తులు!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ జ‌ర్న‌లిస్ట్‌ ల‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు . భూమి మీద నిజాయితీ లేని వ్య‌క్తుల్లో జ‌ర్న‌లిస్టులే ముందుంటార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌స్తుతం మీడియాతో యుద్ధం చేస్తున్నాన‌ని, త‌న ప్ర‌మాణ స్వీకారానికి చాలా త‌క్కువ మంది వ‌చ్చార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌ మీడియా త‌గిన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. "నా ప్రమాణ‌స్వీకారానికి భారీగా ప్ర‌జ‌లు వ‌చ్చారు. ఆ ఫీల్డ్ మొత్తం జ‌నంతో నిండిపోయింది. కానీ టీవీలో ఓ చానెల్ చూస్తే గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉన్న‌ట్లు చూపించారు" అని ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఐఏ హెడ్‌ క్వార్ట‌ర్స్‌లో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ట్రంప్ ఈ మేర‌కు నిప్పులు కురిపించారు. "నేను ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో ప‌ది - ప‌దిన్న‌ర ల‌క్ష‌ల మంది వ‌చ్చిన‌ట్లు నాకు అనిపించింది. కానీ ఎవ‌రూ లేని చోటును మాత్ర‌మే ఆ టీవీ వాళ్లు చూపించారు. కానీ జ‌నం వెల్లువ‌లా వ‌చ్చారు. వ‌ర్షం ప‌డుతుంద‌న్న భ‌యం ఉన్నా.. నా ప్ర‌సంగ స‌మ‌యానికి దేవుడు క‌రుణించి వ‌ర్షం కురిపించ‌లేదు" అని ట్రంప్ అన్నారు. తాను ప్ర‌సంగం ముగించి వెళ్ల‌గానే భారీ వ‌ర్షం కురిసిందని ట్రంప్ చెప్పారు. తన ప్రమాణస్వీకారానికి కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే వచ్చినట్లు ఆ చానెల్ ప్రసారం చేసిందని ఆయన అన్నారు. ఆ సంఖ్య తక్కువేమీ కాదని, అయితే అది కేవలం కాపిటల్ హిల్ బిల్డింగ్ పరిసరాల్లోనే ఉన్నారని, ఇక 20 బ్లాక్ ఏరియా, అటు వాషింగ్ట‌న్ మాన్యుమెంట్ వ‌ర‌కు కూడా మొత్తం జ‌నంతో నిండిపోయింద‌ని ట్రంప్ వెల్ల‌డించారు. త‌ప్పుడు వార్త ప్ర‌సారం చేసినందుకు వాళ్లు మూల్యం చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు. ఇంటెలిజెన్స్ క‌మ్యూనిటీతో త‌న‌కు విభేదాలు ఉన్నాయ‌ని మీడియా చెప్ప‌డం వ‌ల్లే తాను ప్ర‌త్యేకంగా ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు సీఐఏ అధికారుల‌తో ఆయ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/