Begin typing your search above and press return to search.

ట్రంప్ దంప‌తుల `డిస్కో` డ్యాన్స్!

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:18 PM GMT
ట్రంప్ దంప‌తుల `డిస్కో` డ్యాన్స్!
X
అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయ‌బోతున్నార‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డ్డ‌ప్ప‌టినుంచి ఆయ‌న‌పై మ‌హిళా లోకం తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ట్రంప్ స్త్రీ లోలుడ‌ని, ఆయ‌న‌కు చాలామంది మ‌హిళ‌ల‌తో లైంగిక‌, అక్ర‌మ సంబంధాలున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా, ఓ పోర్న్ స్టార్ తో ట్రంప్ ఎఫైర్ ను క‌ప్పి పుచ్చేందుకు ఆమెకు భారీ మొత్తంలో న‌గ‌దు ముట్ట‌జెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో, ట్రంప్ న‌కు ఆయ‌న భార్య మెలానియాకు మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయ‌ని అమెరికా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ట్రంప్ తో మెలానియా దూరం పాటిస్తున్నారంటూ మీడియా కోడై కూసింది. దానికి త‌గ్గ‌ట్లుగానే ట్రంప్ అధికారిక ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన సంద‌ర్భంగా మెలానియా ఆయ‌న‌తో ఎడ‌మొహం....పెడ‌మొహంగా ఉండ‌డం ఆ వార్త‌ల‌కు ఊత‌మిచ్చింది. అయితే, తాజాగా ఆ పుకార్ల‌కు ట్రంప్ దంప‌త‌తులు చెక్ పెట్టారు. వారిద్ద‌రూ ఓ డిస్కో పార్టీలో సన్నిహితంగా మెలుగుతూ అంద‌రికీ షాక్ ఇచ్చారు.

ఫ్లోరిడాలోని ఓ స్కూల్ లో ఉన్మాది న‌ర‌మేధం రేపిన త‌ర్వాత బాధితులను పరామర్శించేందుకు బ్రోవార్డ్‌ హెల్త్‌ నార్త్‌ ఆస్పత్రికి ట్రంప్ దంపతులు వెళ్లారు. అక్క‌డ వారిద్ద‌రూ జంట‌గా రావ‌డ‌మే కాకుండా అన్యోన్యంగా మెలుగుతూ కనిపించారు. అంతేకాదు, వారిద్ద‌రూ అక్క‌డ నుంచి నేరుగా మారా లాగో రిసార్ట్ లోని స్టూడియో 54లో జరిగిన డిస్కో పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలో మెలానియా, ట్రంప్ లు చేతిలో చేయి వేసి బాస‌లు చెప్పుకున్నారు. అంతేకాదు....వారిద్ద‌రూ హుషారుగా కబుర్లు చెప్పుకున్నారు. ట్రంప్ విశ్రాంతి తీసుకుంటూ భార్య చెప్పే ముచ్చ‌ట్లు ఆస‌క్తిగా వినడం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో, ఆ వీడియో కొద్ది సేప‌ట్లోనే వైర‌ల్ అయింది. ట్రంప్ - మెలానియాలు అన్యోన్యంగా ఉన్నారంటూ నెటిజ‌న్తు కామెంట్లు పెడుతున్నారు. ఆలూమ‌గ‌ల‌న్న త‌ర్వాత క‌ల‌హాలు రావ‌డం స‌హ‌జ‌మ‌ని, ట్రంప్ చేతిని విసిరి కొట్టిన మెలానియా....ఇపుడు ఆయ‌న చేతిలో చేయి వేసి ఊసులాడ‌డం చూస్తేనే వారి దాంప‌త్య జీవితం ఆనందంగా ఉంద‌ని తెలుస్తోంద‌ని కామెంట్ చేస్తున్నారు.