Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గూటికి వ‌చ్చేసిన దొమ్మేటి..!

By:  Tupaki Desk   |   23 Nov 2017 8:57 AM GMT
జ‌గ‌న్ గూటికి వ‌చ్చేసిన దొమ్మేటి..!
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర సాగిపోతోంది. జ‌గన్ చూసేందుకు ప్ర‌జ‌లు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న‌దైన హామీల‌తో ప్ర‌జ‌ల్ని ఉత్తేజితుల్ని చేస్తున్న జ‌గ‌న్‌.. రానున్న రోజుల్లో త‌మ చేతికి అధికారం ఖాయ‌మ‌న్న మాట‌ను బ‌లంగా వినిపిస్తున్నారు. ఊహించని రీతిలో హామీలు ఇస్తూ ముందుకెళుతున్న జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న ల‌భిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం లో పాద‌యాత్ర‌ను చేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌ద్ద‌కు చేరుకున్న తూర్పుగోదావ‌రి జిల్లా డీసీసీ మాజీ అధ్య‌క్షుడు.. మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంక‌టేశ్వ‌ర్లు పార్టీలో చేరారు. ఆయ‌న్ను ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ అధ్వ‌ర్యంలో పాద‌యాత్ర వ‌ద్ద‌కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా దొమ్మేటిని పార్టీ కండువాను క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా దొమ్మేటి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి బాట ప‌డుతోంద‌న్న ఆశ‌తోనే తాను పార్టీలో చేరిన‌ట్లు వెల్ల‌డించారు.

గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రాన్ని అవినీతిలో నెంబ‌ర్ వ‌న్ చేశార‌ని మండిప‌డ్డ దొమ్మేటి.. రాజ‌న్న రాజ్యం జ‌గ‌న్ తోనే సాధ్య‌మ‌న్నారు పాద‌యాత్ర‌లో ప‌లువురు వృద్ధులు జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి త‌మ‌కు వృద్ధాప్య పింఛ‌న్లు రావ‌టం లేద‌నిచెప్ప‌టం క‌నిపించింది. అలా వ‌చ్చిన వారికి భ‌రోసానిస్తూ.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పింఛ‌న్ల విష‌యంలో జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్దుతామ‌ని.. రూ.2వేలు చొప్పున వ‌చ్చేలా చేయ‌టంతో పాటు.. స‌కాలంలో అందిస్తామ‌ని చెప్ప‌టం క‌నిపించింది.