Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 'ట్రంప్' కిడ్నాప్‌

By:  Tupaki Desk   |   25 May 2017 7:21 AM GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ట్రంప్ కిడ్నాప్‌
X
త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించిన వార్త కాదు ఇది. ఢిల్లీకి చెందిన ట్రంప్ అనే శున‌కానికి సంబంధించిన వార్త ఇది. ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల కుక్క పేరు ట్రంప్‌. రూప్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన మ‌హేంద్ర‌నాథ్ అనే వ్య‌క్తి ప‌గ్ జాతికి చెందిన ఈ శున‌కానికి ట్రంప్ అన్న పేరు పెట్టుకొని పెంచుతున్నాడు.

అయితే.. బుధ‌వారం సాయంత్రం ఆరున్న‌ర గంట‌ల ప్రాంతంలో మ‌హేంద్ర‌నాథ్ ఇంట్లో గార్డుగా ప‌ని చేస్తున్న ఓంవీర్ కుక్క‌ను వాకింగ్‌ కు తీసుకెళ్లాడు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రు వ్య‌క్తులు కారులో వ‌చ్చి ట్రంప్‌ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. దీంతో.. కుక్క య‌జ‌మాని త‌న ట్రంప్‌ను ఎవ‌రో కిడ్నాప్ చేసిన‌ట్లుగా చెప్పి ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. తాను అమితంగా ప్రేమించే త‌న బుజ్జి ట్రంప్ ను కానీ క్షేమంగా తీసుకొస్తే ప‌ద‌కొండువేల రూపాయిల బహుమానాన్ని కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. ఈ ఢిల్లీ ట్రంప్ ఆచూకీని ప‌ట్టుకోవ‌టానికి పోలీసులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/