Begin typing your search above and press return to search.

బాత్రూంలో సెక్స్ కు నో చెప్పిందన్న భార్యను ఏం చేశాడంటే..

By:  Tupaki Desk   |   19 Aug 2019 6:07 AM GMT
బాత్రూంలో సెక్స్ కు నో చెప్పిందన్న భార్యను ఏం చేశాడంటే..
X
జీవితంలో రొమాన్స్ ముఖ్యమే. కానీ.. తాజా ఉదంతం వింటే మాత్రం.. అవాక్కు అవ్వాల్సిందే. ప్రేమించి పెళ్లాడిన భార్య బాత్రూంలో రొమాన్స్ కు నో చెప్పిందన్న కారణంగా సదరు భర్త తీసుకున్న నిర్ణయానికి ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతం అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది.

టెక్సాస్ కు చెందిన జాన్.. కొరొలిన్ జంట ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి మధ్య అన్యోన్యత ఎక్కువే. భర్తకు సెక్స్ కోరికలు ఎక్కువే అయినా.. అతడు కోరుకున్నట్లుగా ఉంటూ అతడికి తగ్గట్లుగా ఉండేది కొరొలిన్. భర్తకు తగ్గట్లుగా సహకరించినప్పటికీ అతగాడికి ఒక కోరిక మాత్రం తీరకుండా ఉండేది.

జాన్ కు బాత్రూంలో షవర్ కింద స్నానం చేస్తూ.. భార్యతో రొమాన్స్ చేయాలన్న కోరిక ఉండేది . భర్త కోరికలన్నింటికి నో చెప్పని కొరొలిన్ మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పేది. దీనికి కారణం లేకపోలేదు. ఆమెకు బాత్రూం అంటే చిరాకు. అందులో తాను ఎక్కువసేపు ఉండలేనని.. ఆ ఒక్క చోట మాత్రం నో చెప్పేసేది.

ఇది జాన్ కు అస్సలు నచ్చేది కాదు. తానెంత చెప్పినా.. బాత్రూంలో రొమాన్స్ కు భార్య ససేమిరా అనటంతో చిర్రెత్తుకొచ్చిందట. అంతే.. తన కోరికకు సహకరించని భార్యకు కటీఫ్ చెప్పేస్తూ విడాకులు ఇచ్చేశాడు. ఇతగాడి పైత్యం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాను చెప్పినట్లుగా ఉండాలనుకునే జాన్ లాంటి భర్తలు.. భార్యలకు మనసు ఉంటుందని.. దాని గురించి కూడా పట్టించుకోకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. ఇంత చిన్న కారణానికి కూడా విడాకులు ఇవ్వటమా? అంటూ అతడి స్నేహితులు అవాక్కు అవుతున్నారట. స్నేహితుల పరిస్థితే ఇలా ఉంటే.. భార్య కారొలిన్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో కదా?